Weight Loss: బరువు తగ్గాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేసుకోండి..!
Weight Loss: స్లిమ్ గా, యంగ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో..
Weight Loss: స్లిమ్ గా, యంగ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. జీవితంలో ఎదగాలనే ఆకాంక్ష, వర్క్ బిజీలో ఆరోగ్యం, ఆహార్యం గురించి పట్టించుకునే తీరికే ఎవరికీ ఉండటం లేదు. అయినప్పటికీ.. కొద్దొగొప్పో మంది ఆరోగ్యంపై, శరీరాకృతిపై ఇంట్రస్ట్ చూపుతున్నారనే చెప్పాలి. బరువు తగ్గడానికి, శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డైట్ పాటిస్తే.. మరికొందరు జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేస్తుంటారు. ప్రధానంగా మాత్రం డైట్ ఫాలో అయ్యేవారే ఎక్కువగా ఉంటారు. అయితే, ఆ డైట్ కొన్నిసార్లు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. తెలియక చేసే పొరపాట్ల కారణంగా.. లేని సమస్యలు తలెత్తుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉదయం పూట కొన్ని చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..
ఎక్కువ వేడి నీటిని త్రాగాలా? ఎక్కువ హార్డ్, వేడి నీటిని తాగడం వల్ల కొవ్వు కరిగిపోతుందనే సాధారణ అపోహ ఉంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడినీళ్లు తాగాలి కానీ, అతిగా మరిగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.
వ్యాయామం తర్వాత చేయకూడని తప్పులు.. వ్యాయామం చేసిన తరువాత చాలాసేపటి వరకు నీళ్లు తాగకూడదని బరువు తగ్గాలనుకునేవారు కొందరు భావిస్తుంటారు. అలా చయేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని విశ్వాసం. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం మధ్యమధ్యలో నీరు త్రాగాలి. అప్పుడే అనుకున్న పని సులువు అవుతుంది.
పిండి పదార్థాలు లేకపోవడం.. రోజూ వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. కేవలం ప్రోటీన్ ఉంటే సరిపోదు. దాంతో పాటు పండ్లు కూడా ఉండాలి. ఇందులో తగినంత పిండి పదార్థాలు కూడా ఉండాలి. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ప్రోటీన్‌పై మాత్రమే ఆధారపడతారు.
అలా చేసిన వెంటనే అల్పాహారం తీసుకొద్దు.. బరువు తగ్గాలంటే లైట్ డైట్ తీసుకోవాలి. అయితే కొంతమంది బ్రేక్ ఫాస్ట్ రొటీన్ కూడా పాటిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామం చేసిన వెంటనే అల్పాహారం పొరపాటున కూడా తీసుకోకూడదు. వ్యాయామం చేసి అల్పాహారం తీసుకుంటే బరువు తగ్గుతారు. కానీ శరీరాన్ని అనేక వ్యాధులు వస్తాయి.