Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైలెంట్ కిల్లర్.. యమ డేంజర్.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..

అధిక రక్తపోటు వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు. దీని ప్రారంభ లక్షణాలు గుర్తించబడవు.. ఆలస్యంగా గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రమవుతుంది. అధిక రక్తపోటు వ్యాధి కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. దాని లక్షణాలు ఏమిటి.. దానిని ఎలా నివారించవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

సైలెంట్ కిల్లర్.. యమ డేంజర్.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..
Liver Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2025 | 1:46 PM

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు.. దీనికి సకాలంలో చికిత్స పొందడం ముఖ్యంగా.. హైబీపీ ( హైపర్‌టెన్షన్ ) అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని లక్షణాలు ఆలస్యంగా గుర్తించబడతాయి.. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్.. అతి ప్రమాదకరమైనదిగా పేర్కొంటారు వైద్యులు.. అధిక రక్తపోటు.. గుండె, మెదడును ప్రభావితం చేస్తుంది.. అయితే.. బ్లడ్ ప్రెజర్ వ్యాధి కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందని మీకు తెలుసా? అవును.. అధిక రక్తపోటు లివర్ ఫైబ్రోసిస్‌కు కూడా దారితీస్తుంది. కాలేయం పదే పదే దెబ్బతిని గాయాలు ఏర్పడటం ప్రారంభించినప్పుడు లివర్ ఫైబ్రోసిస్ వస్తుంది..

హైపటెన్షన్ కాలేయ పనితీరును క్రమంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ వ్యాధులకు సకాలంలో చికిత్స చేయకపోతే అది లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. హెపటైటిస్ లేదా ఆల్కహాల్ వినియోగం కాలేయ వ్యాధులకు కారణమైనట్లే, అధిక రక్తపోటు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక రక్తపోటు కాలేయాన్ని ఎలా దెబ్బతీస్తుంది?

పెరిగిన BP కాలేయంలో రక్తం సరిగ్గా ప్రవహించకుండా చేస్తుందని మెడిసిన్‌కు చెందిన డాక్టర్ అజయ్ కుమార్ వివరించారు. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, అది స్టెలేట్ కణాలను (ఫైబ్రోసిస్ ప్రధాన డ్రైవర్) సక్రియం చేస్తుంది. అటువంటి కణాలు సక్రియం అయినప్పుడు, అవి కొల్లాజెన్, ఇతర మాత్రికలను అధికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది. మీకు అధిక రక్తపోటు ఉండి, జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే, అది కాలేయం దెబ్బతిన్నట్లు సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రతిరోజూ తమ రక్తపోటును తనిఖీ చేసుకోవాలని డాక్టర్ కుమార్ సూచిస్తున్నారు. ఇది ఇంకా ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవాలి. బిపి వ్యాధిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంటే అది ప్రమాదకరమైనదిగా మారొచ్చు.. ఒక్కోసారి కాలేయానికి పూర్తిగా నష్టం కలిగించవచ్చు.

ఈ లక్షణాలపై శ్రద్ధ వహించండి..

  • అలసట, బలహీనత
  • కడుపులో అసౌకర్యం, కుడివైపు పైభాగంలో కడుపు నిండిన భావన.
  • వాపు
  • కామెర్లు
  • బాగా బరువు తగ్గడం
  • కడుపుని సరిగ్గా ఖాళీ చేయలేకపోవడం (జీర్ణ సమస్యలు)

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..