Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Food Habits: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫర్మ్‌ అయిపోద్ది! బీ కేర్‌ ఫుల్

వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడిపోతారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లోపడతారు. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి.. మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది..

Summer Food Habits: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫర్మ్‌ అయిపోద్ది! బీ కేర్‌ ఫుల్
Summer Food Habits
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 20, 2025 | 1:24 PM

వేసవిలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లోపడతారు. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి.. మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు తాగాలని చెబుతుంటారు. ఆహారంలో హైడ్రేషన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. అదేవిధంగా వేసవిలో మనం రోజూ తీసుకునే అనేక ఆహారాలు తెలియకుండానే శరీరం నిర్జలీకరణానికి దారితీస్తాయి. అందువల్ల ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, అలాగే వేయించిన, డీప్-ఫ్రై చేసిన ఆహారాలు వేసవికి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. బదులుగా పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పండ్లు, కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా వేసవిలో ఈ కింది ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అవేంటంటే..

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు

వేసవిలో వీలైనంత వరకు ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ తగ్గి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

వేయించిన ఆహారం

వేసవిలో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్, భాజీ వంటి నూనెలో వేయించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా, ఇటువంటి ఆహారాలు జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

కాఫీ

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వేసవిలో కాఫీ వినియోగాన్ని పరిమితం చేయడం చాలా మంచిది.

ఊరగాయలు

ఊరగాయలలో సోడియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి, వేసవిలో వీలైనంత వరకు వాటిని తినకుండా ఉండటం మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుంది. పైగా ఎక్కువ ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ పోషకమైనవి అయినప్పటికీ, వేసవిలో వాటి వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. తద్వారా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

సోడా

సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలు వాటిని పదేపదే తాగాలనే కోరికలను కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవిలో దీన్ని తాగాలనే కోరిక పదే పదే పెరుగుతుంది. కానీ దీని అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది నిర్జలీకరణానికి కూడా దారితీస్తుంది.

కారంగా ఉండే ఆహారాలు

వేసవిలో వీలైనంత వరకు అతిగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం కూడా మంచిది. కారంగా ఉండే ఆహారాలలో కనిపించే కాప్సైసిన్ అనే సమ్మేళనం నిర్జలీకరణం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, అజీర్ణం, అనారోగ్యానికి కారణమవుతుంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.