AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Fruits Wrong Mix: ఈ పండ్ల కాంబినేషన్లు మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. పొరపాటున కూడా ఇలా తినకండి..!

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల అనర్థాలు జరగొచ్చు. జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, వాంతులు వంటి సమస్యలకు దారి తీసే కలయికలు కొన్ని ఉన్నాయి. అటువంటి పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Healthy Fruits Wrong Mix: ఈ పండ్ల కాంబినేషన్లు మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. పొరపాటున కూడా ఇలా తినకండి..!
Healthy Fruits
Prashanthi V
|

Updated on: Jul 02, 2025 | 8:36 PM

Share

కొందరికి తెలిసి ఉండకపోవచ్చు కానీ, కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి మేలు కాకపోవచ్చు. కొన్ని పండ్లను వేర్వేరుగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని కలిపి తినడం వల్ల చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పండ్ల జ్యూస్‌ లను కలిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి కొన్ని పండ్ల మిశ్రమాలను తినడం మానుకోవాలి.

నారింజ, క్యారెట్

నారింజ, క్యారెట్ రెండింటినీ విడివిడిగా తింటే శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ కలిపి జ్యూస్‌ గా తీసుకుంటే అది ఎసిడిటీకి దారితీస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారికి ఇది సమస్యలు కలిగించవచ్చు. కడుపులో మంట, ఉబ్బరం లాంటి సమస్యలు రావచ్చు.

జామపండు, అరటిపండు

జామపండు చక్కెర ఉన్నవారికి మంచిదే. అలాగే అరటిపండు కూడా ఆరోగ్యకరమైన పండు. కానీ ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొందరికి వాంతులు, తలనొప్పి లాంటి చెడు ప్రభావాలు కనిపించొచ్చు.

బొప్పాయి, నిమ్మరసం

జ్యూస్ తయారీలో చాలా మంది నిమ్మరసం కలిపే పద్ధతిని పాటిస్తారు. కానీ బొప్పాయి జ్యూస్‌ లో నిమ్మరసం కలిపితే ఇది జీర్ణవ్యవస్థకు ఇబ్బందిని కలిగించవచ్చు. సిట్రిక్ యాసిడ్ వల్ల బొప్పాయిలోని కొన్ని పోషకాలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.

అరటిపండు, పుల్లని పండ్లు

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒంటరిగా తినడానికి చాలా మంచిది. కానీ దీంతో పాటు నారింజ, ముసంబి లాంటివి తింటే శరీరంలో ఎసిడిటీ పెరిగే అవకాశముంది. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపొచ్చు.

ఆపిల్, పుచ్చకాయ

ఆపిల్ తినడం వల్ల శరీరానికి మంచి లాభాలు కలుగుతాయి. అలాగే పుచ్చకాయ కూడా మంచి నీరున్న పండ్లలో ఒకటి. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పుచ్చకాయ

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇది నీరసం తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కానీ పుచ్చకాయను ఇతర పండ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

పైనాపిల్, పాలు

పైనాపిల్‌ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలతో కలిసినప్పుడు కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అజీర్ణం, ఎసిడిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి ఏ పండ్లను కలిపి తినాలో, ఏవి వేరుగా తినాలో తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)