Liver Health: కాలేయాన్ని గుల్ల చేసే డేంజరస్ వ్యాధి.. ఈ 8 సూపర్ ఫుడ్స్‌తో చెక్
ఆధునిక జీవనశైలితో పాటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే ఈ సమస్యను ముందుగానే గుర్తించి, సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మార్చుకుంటే, కాలేయాన్ని తిరిగి ఆరోగ్యంగా మార్చవచ్చు. కొన్ని రకాల ఆహారాలు ఈ ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం, శక్తి లేకపోవడం. కాలేయం సరిగా పని చేయకపోవడం వల్ల పోషకాలను సరిగా జీర్ణం చేయలేకపోవడం, విష పదార్థాలను వడపోయలేకపోవడం దీనికి కారణం. పొట్ట పైభాగంలో, కుడి వైపున (కాలేయం ఉన్న ప్రాంతం) మందమైన నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు. కాలేయం వాపుకు గురవడం వల్ల ఇది వస్తుంది.
ఆకలి మందగించడం, ఆహారంపై కోరిక తగ్గడం.
ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు ఆకస్మికంగా తగ్గడం.
వ్యాధి ముదిరినప్పుడు పొట్టలో ద్రవం పేరుకుపోయి ఉబ్బరం రావచ్చు.
ద్రవం పేరుకుపోవడం వల్ల కాళ్లు, ఇతర శరీర భాగాలలో వాపు రావొచ్చు.
చర్మంపై దద్దుర్లు లేకుండా దురద రావడం.
ఇది తీవ్రమైన దశలో కనిపించే లక్షణం. కాలేయం బిలిరుబిన్‌ను సరిగా తొలగించలేనప్పుడు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారతాయి.
కాలేయ పనితీరు దెబ్బతిన్నప్పుడు మూత్రం రంగు మారడం, మలం రంగు లేత రంగులోకి మారడం గమనించవచ్చు.
రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను కాలేయం సరిగా తయారు చేయలేకపోవడం వల్ల చిన్న గాయాలకు కూడా సులువుగా రక్తస్రావం అవడం లేదా గాయాలు పడవచ్చు.
కాలేయం విష పదార్థాలను తొలగించలేకపోవడం వల్ల అవి మెదడుకు చేరి గందరగోళం, మతిమరుపు లేదా ఏకాగ్రత లోపానికి దారి తీయవచ్చు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల పురుషులలో ఈ లక్షణం కనిపించవచ్చు.
ఫ్యాటీ లివర్‌ను తగ్గించే ఆహారాలివి..
కాఫీ: కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ (CGA) అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేసి, కాలేయ వాపును తగ్గిస్తుంది.
పాలకూర: పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
బీన్స్ (పప్పులు, శనగలు, సోయాబీన్స్, బఠానీలు కలిపి): వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సంతృప్త కొవ్వు తక్కువ. ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఓట్‌మీల్: ఓట్‌మీల్‌లో బీటా-గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని రక్షించి, వాపును తగ్గిస్తాయి. డయాబెటిస్, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
వెల్లుల్లి: వెల్లుల్లి కాలేయ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్): వీటిలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడవచ్చు.
కొవ్వు చేపలు (సాల్మన్, సార్డినెస్, ట్యూనా, ట్రౌట్): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ను మెరుగుపరుస్తాయి.
ద్రాక్ష: ద్రాక్ష తొక్క, గింజలలో ఉండే ఒక సమ్మేళనం కాలేయ సమస్యలను మెరుగుపరుస్తుందని పరిశోధనలు చూపించాయి.
ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు.
గమనిక: ఈ లక్షణాలు ఫ్యాటీ లివర్‌కు సంబంధించినవి కావచ్చు, లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, స్వీయ నిర్ధారణ చేసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన నిర్ధారణ, సకాలంలో చికిత్స కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.




