AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: ఫిట్‌గా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తోంది.. ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉందా?

Health Tips: ఇటీవలి కాలంలో సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజ్ కౌశల్‌తో పాటు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి ప్రముఖులు 40 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు.

Heart Attack: ఫిట్‌గా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తోంది.. ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉందా?
Heart Attack
Venkata Chari
|

Updated on: Mar 05, 2022 | 1:08 PM

Share

ఆస్ట్రేలియా గ్రేట్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(Shane Warne) గుండెపోటు(Heart Attack)తో శుక్రవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వార్న్ థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో తన ప్రాణాలను వదిలాడు. అతను ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా పేరు పొందాడు. తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నాడని, వైద్య సహాయం అందించినప్పటికీ, షేన్ వార్న్ తిరిగి స్పృహలోకి రాలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణించిన వార్తలు మనం తరుచుగా వింటూనే ఉన్నాం. ఇంతకుముందు, గుండెపోటు సాధారణంగా 55 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపించేంది. అయితే ఇటీవలి కాలంలో సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజ్ కౌశల్‌తో పాటు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి ప్రముఖులు 40 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సెలబ్రిటీలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండడం గమనార్హం.

సహజంగానే ఈ సెలబ్రిటీలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ తీసుకున్నారు. అయినా, వీరు చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే యువకులు కూడా ఎందుకు గుండెపోటు ఎందుకు వస్తుంది.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంతకు ముందు గుండెపోటును వృద్ధాప్య వ్యాధిగా పిలిచేవారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారు దీని బాధితులుగా ఉండేవారు. అయితే గత కొన్నేళ్లుగా యువత కూడా వేగంగా దీని బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫిట్‌గా ఉన్నా.. లోపల ప్రమాదాలు తెలియకపోవచ్చు.. మీరు బయటి నుంచి చూడ్డానికి చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారని డాక్టర్లు అంటున్నారు. కానీ ఇలాంటి వ్యాధులు మీ శరీరం లోపల పెరుగుతుంటాయి. ఇది మీకు పూర్తిగా తెలియదు.

గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది ఆక్సిజన్ లేకపోవడం, వెంటనే చికిత్స చేయకపోతే, గుండె కండరాలకు మరణం సంభవిస్తుంది. గుండెపోటు లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కాలక్రమేణా కొలెస్ట్రాల్ సహా అనేక రకాల వ్యర్థాలు రక్తంలో పేరుకుపోతాయని, ఇది ధమనులను అడ్డుకుని గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏమిటి? రెండు పరిస్థితులు ఒకేలా ఉన్నప్పటికీ, అవి వైద్యపరంగా విభిన్నంగా నిర్ధారణ చేస్తారు. వాటికి వేర్వేరు చికిత్సలు చేస్తుంటారు. ఒత్తిడి కూడా దీనికి ఒక పెద్ద కారణం కావచ్చు. ఎందుకంటే ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెకు ప్రాణాంతకంగా మారుతుంది.

గుండెపోటు వచ్చే ముందు కనిపించే సాధారణ లక్షణాలు..

శరీరం ఎడమవైపు బిగుతుగా అనిపించడం

ఛాతీ లేదా చేతులు, మెడ నొప్పి

నొప్పి దవడ లేదా వెనుకకు వ్యాపిస్తుంది

వికారం

అజీర్ణం

వేడిమి

కడుపు నొప్పి

శ్వాస ఆడకపోవుట

బాగా చెమట పట్టడం

అలసట

తేలికగా అనిపించడం

ఆకస్మిక మైకం

Also Read: Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

IND vs SL: 4 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ.. రీ ఎంట్రీలో అదరగొట్టిన జడ్డూ.. భారీ స్కోర్ దిశగా భారత్..