Saunf Sharbat: చల్లదనమే కాదు బరువు కూడా తగ్గొచ్చు.. సోంపు షర్బత్ ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

Variyali Sharbat: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వేడిని తట్టుకోవడానికి.. చాలామంది శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో చక్కెర అధికంగా ఉండే

Saunf Sharbat: చల్లదనమే కాదు బరువు కూడా తగ్గొచ్చు.. సోంపు షర్బత్ ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
Fennel Sharbat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2022 | 11:59 AM

Variyali Sharbat: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వేడిని తట్టుకోవడానికి.. చాలామంది శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో చక్కెర అధికంగా ఉండే అనారోగ్యకరమైన పానీయాలకు బదులుగా, మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీరు ఈ పానీయాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి తాపానికి చక్కటి పానీయం (వరియాలి) సోంపుల షర్బత్. మీరు ఇంట్లో కూడా సోంపుల షర్బత్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడంతోపాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని (Fennel Sharbat Recipe) ఎలా తయారు చేయాలి..? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు గింజల షర్బత్ కోసం..

దీన్ని చేయడం కోసం.. 1/4 కప్పు సోపు గింజలు, 1/4 కప్పు పంచదార, 3 యాలుకలు, 1 టీస్పూన్ నల్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తులసి గింజలు, చల్లని నీరు అవసరం.

వరియాలి షర్బత్ ఎలా తయారు చేయాలంటే..?

ముందుగా తులసి గింజలను నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సి జార్‌లో సోంపు గింజలను వెయండి.. దీని తర్వాత పచ్చి ఏలకులు, పంచదార వేయాలి. ఆ తర్వాత మిక్సిలో మెత్తగా చేయాలి. ఒక పెద్ద జగ్‌లో 3 టేబుల్‌స్పూన్ల సొంపు గింజల పొడి, ఉప్పు, నిమ్మరసం, తగినంత చల్లని నీరు వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి గ్లాసుల్లో పోయాలి. నానబెట్టిన తులసి గింజలను ఒక గ్లాసులో పోసి కలపాలి. ఆ తర్వా నోరూరించే షర్బత్ రెడీ అవుతుంది.

వరియాలి.. ఆరోగ్య ప్రయోజనాలు

సోంపులో మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. సోంపు శరీరాన్ని చల్లబర్చుతుంది. మీరు మీ వేసవి ఆహారంలో సోంపులను చేర్చుకోవడం మంచిది. ఒక గ్లాసు వరియాలి (సోంపు గింజల) షర్బత్ తాగడం వల్ల మీ శరీరం చల్లగా మారుతుంది. అదేవిధంగా వేసవి తాపం నుంచి కూడా బయటపడొచ్చు.

సోంపు గింజల్లో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సోంపు గింజలు పని చేస్తాయి. వేసవి కాలంలో చాలా మంది జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక గ్లాసు ఫెన్నెల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లను దూరంగా ఉంచుతాయి. సోంపులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read:

Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటున్నారా.. దాని ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

BP Control Tips: బీపీ అస్సలు రాకుండా ఉండాలంటే.. ముందు ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..