Health: యువత అకస్మాత్తుగా కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఇదే.. దీన్ని మానేస్తే మీరు సేఫ్
జామ కాయలోనూ అదే... మామాడికాయ తినేటప్పుడు అదే.. నేరేడు కాయ తినేటప్పుడు అదే.. రేగ్గాయలు తినేటప్పుడూ దాన్ని యాడ్ చేయాల్సిందే. అది.. మామూలు ప్రమాదకారి కాదు.. ప్రాణాలు హరించేస్తుంది.

మన శరీరం అంతటికి రక్త సరఫరా జరిగితేనే.. అన్ని అవయవాలు జీవక్రియను సజీవంగా చేయగలుగుతాయి. రక్తం ద్వారానే మన శరీరంలోకి గాలి, నీరు, ఆహారం, ఇతర పోషకాలు వెళ్తాయి. రక్తం ద్వారానే వ్యర్థాలు శరీర అవయవాల నుంచి బయటకు వస్తాయి. అయితే ఈ రక్తం శరీరం అంతా వెళ్లడానికి అతి ముఖ్యమైన భాగం గుండె. రక్తం పంప్ చేయడంతో.. గుండె కండరాలు(కార్డియాక్ మజిల్స్) ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. అతి బలమైన కండరం కూడా ఇదే. అయితే గుండె సంకోచ, వ్యాకోచాలకు సవ్యంగా జరగకుండా చేసే ప్రధాన శత్రువు మనం తినే ఉప్పు.
ఊరగాయలను, తినే కూరలను పక్కనబెడితే… మొక్కజొన్న పొత్తుల్లో, జామ కాయల్లో, మామిడి కాయల్లో, నేరేడు కాయల్లో.. ఇలా అన్నింటికి టచ్చింగ్‌గా ఉప్పును తింటున్నారు చాలామంది. దీంతో గుండె కణజాలంలో కూడా ఉప్పు శాతం పెరుగుతుంది. ఆ ఉప్పుకు గట్టి పరిచే గుణం ఉంటుంది. అంచేత కార్డియాక్ మజిల్ హార్డ్ అయ్యి.. ముడుచుకుంటుంది కానీ సాగే గుణం కోల్పోతుంది. ఏజ్ గడిచే కొద్దీ కార్డియాక్ మజిల్.. బయటకు పంపే రక్తం మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది బరువు పనులు చేయలేరు. కనీసం మెట్లు కూడా ఎక్కలేరు. చిన్న, చిన్న పనులు చేసి కూడా ఓ రొప్పుతూ ఉంటారు.
ఎటువంటి గుండె జబ్బులకు ప్రధాన శత్రవు ఉప్పు కాబట్టి దానిపై ప్రధానమైన అటెన్షన్ పెట్టమని చెబుతున్నారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. యువత హఠాత్తుగా కుప్పకూలిపోవడానికి ఉప్పే ప్రధాన కారణమని ఆయన చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గిస్తే.. అసలు మానిసి.. ఆల్టర్‌నేటివ్ ఆహార పదార్థాలను వినియోగిస్తే.. ఎంతో మంచిదని మంతెన చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)