Exam Anxiety: పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడాలా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..
ముఖ్యంగా మన తోటి వారు బాగా చదువుతున్నారనే భావనతో పాటు కుటుంబ సభ్యులు మనపై పెట్టకునే అంచనాలు అందుకోగలుగుతామో? లేదో? అనే భయం వేధిస్తూ ఉంటుంది. టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఈ ఒత్తిడిని ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే వారి వయస్సు వారిపై అధిక ప్రభావం చూపుతుంది.

మార్చి నెల వచ్చిందంటే చాలు విద్యార్థులను ఎక్కడి లేని భయం వేధిస్తూ ఉంటుంది. అవే ఎగ్జామ్స్.. ఎల్‌కేజీ నుంచి పీజీ విద్యార్థుల వరకూ పరీక్షల టెన్షన్ మామూలుగా ఉండదు. భయం, ఆందోళన, అసౌకర్యం వంటి సంకేతాలు సాధారణంగానే ఉంటాయి. అయితే ఈ లక్షణాలు పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో ఉంటే చాలా ఇబ్బందిపడవచ్చు. పాఠశాలలో విద్యార్థులకు, ఈ సమస్య చాలా క్లిష్ట పరిస్థితిని కలిగిస్తుంది. వర్కింగ్ మెమరీ రాజీ పడి, అభ్యాసం తీరుపై దెబ్బతింటుంది. ముఖ్యంగా మన తోటి వారు బాగా చదువుతున్నారనే భావనతో పాటు కుటుంబ సభ్యులు మనపై పెట్టకునే అంచనాలు అందుకోగలుగుతామో? లేదో? అనే భయం వేధిస్తూ ఉంటుంది. టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఈ ఒత్తిడిని ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే వారి వయస్సు వారిపై అధిక ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని నిర్ధిష్ట పద్ధతులను పాటిస్తే ఒత్తిడి సమస్య నుంచి బయటపడవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా వారు పరీక్షలను మరింత జాగ్రత్తగా రాస్తారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా అధ్యయన పద్ధతులను మెరుగుపరచడంతో పాటు ఆందోళనను నిర్వహించడానికి నిపుణులు సూచించే మార్గాలను ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
పరీక్షల ఆందోళన నిర్వహించడానికి చిట్కాలు ఇవే
- స్టడీ టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలి. ముఖ్యంగా సమయానుగుణంగా ఏ సబ్జెక్ట్ ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకుని చదువుకోవాలి. ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసుకునేలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి.
- మైండ్ ఫుల్ నెస్, లోతైగా శ్వాస తీసుకోవడం వంటి ధ్యాన పద్ధుతులను పాటిస్తే ఆందోళన నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆందోళన అనిపించనప్పుడు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
- ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా నేర్చుకోవాలనే తలంపుతో చదవాలి. అలాగే కొంత మంది రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోని చదువుతుంటారు. అలాంటి అనారోగ్యకరమైన పనులు చేయకూడదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
- రివైజ్ చేసుకోవడానికి ఎక్కువ సేపు మేల్కోని ఉండడం కంటే త్వరగా లేచి ఉదయాన్నే చదువుకోవడం మేలు
- ముఖ్యంగా చదువు ధ్యాసలో పడి భోజనం తినడం మానేయకూడదు. ఎందుకంటే ఇది ఆందోళన స్థాయిలను ఎక్కువగా పెంచుతుంది.
- చదివిని విషయాలను గుర్తుంచుకోవాలంటే శరీరానికి సరిపడే నిద్రను అందించాలి. అలాగే చదువుతున్న సమయంలో అరగంటకు ఓ సారి విరామం ఇస్తే మనస్సు స్థిమితపడి చదివినవి బాగా గుర్తుంటాయి.
పరీక్ష రాసే ముందు జాగ్రత్తలు ఇవే..
- పరీక్షను సులభమైన ప్రశ్నలతో ప్రారంభించాలి. తరచూ రాసిన దాన్ని సరి చూసుకోవాలి.
- కాన్సెప్ట్స్‌ను గుర్తు పెట్టుకునే బదులు వాటిని అర్థం చేసుకుని చదివితే మంచి ఫలితం ఉంటుంది.
- గత సంవత్సరం పేపర్లను రివిజన్ చేస్తూ.. వీలైతే సమయనుగుణంగా వాటికి సమాధానాలు రాస్తే పరీక్షల్లో సమయం ప్రకారం జవాబులు రాయడం అలవాటు అవుతుంది.
- మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేస్తూ ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




