Fish Benefits: ఆదివారం ఇష్టంగా చేపలను తింటున్నారా.? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
నాన్‌వెజ్ ప్రియులకు ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. వీకెండ్ వస్తే చాలు.. చికెన్, మటన్ షాపులు బాగా రద్దీగా ఉంటుంటాయి..
నాన్‌వెజ్ ప్రియులకు ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. వీకెండ్ వస్తే చాలు.. చికెన్, మటన్ షాపులు బాగా రద్దీగా ఉంటుంటాయి. చేపలు, చికెన్ మటన్.. ఇలా ఏది ఇష్టమైతే దాన్ని కొంటుంటారు. కొందరికి చికెన్, మటన్ అంటే ఇష్టం.. మరికొందరు చేపలను మహా ఇష్టంగా తింటుంటారు. ఇదంతా పక్కన పెడితే.. అసలు మనం తీసుకుంటున్న ఆహరం మనల్ని ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంచుతుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా.? చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. అస్సలు వదిలిపెట్టరు.
చేపలలో ప్రోటీన్, కాల్షియం, ప్రోస్పరెస్ వంటి పోషకాలు పుష్కలంగా.. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇవి తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు కంట్రోల్‌లో ఉంటాయంటున్నారు. అటు చేపలతో అల్జీమర్స్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టొచ్చన్నారు. అలాగే వీటి ద్వారా పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి. ఇక చేపలలో ఎక్కువగా లభించే EPA, DHA లాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. డిప్రెషన్, ADHD, డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులను నయం చేస్తాయి.
అలాగే చేపలలో ఉండే అధిక నాణ్యత గల ప్రోటీన్‌లు, మంచి కొవ్వు ఊబకాయాన్ని దరికి చేరకుండా.. బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇక సెలీనియం, జింక్, అయోడిన్, విటమిన్ E, A, B2, D వంటి సూక్ష్మపోషకాలు, విటమిన్లు మెరుగైన గుండె పనితీరుకు, రోగనిరోధక వ్యవస్థను( ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్లు) పెంచడంలో సహాయపడతాయి. కాగా, అతిగా తిన్నది ఏదైనా కూడా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. ఏదైనా కూడా మోతాదు మించి తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం మీరేదైనా చిట్కాలు పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.