Health : బీపీ-షుగర్‌కు ఇదే నేచురల్ మెడిసిన్.. రోజుకు 2 ఆకులు నమిలితే చాలు
సతతహరిత మొక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మొక్క ఆకుపచ్చ ఆకులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పువ్వు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

సతతహరిత పువ్వులు, ఆకులను సాంప్రదాయ వైద్యంలో వివిరిగా ఉపయోగిస్తారు. షుగర్ వంటి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఈ మొక్కలు ఇప్పుడు పల్లెటూర్లలోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. సీజన్‌లో దీని పువ్వులు కూడా వికసిస్తాయి. షుగర్.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సతతహరిత అనే పువ్వును ఉపయోగించాలని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి ఈ పువ్వులు, ఆకులు చాలా బాగా ఉపయోగపడుతాయి. అంతేకాదు లుకేమియా మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఇది మంచి మెడిసిన్ అని చెబుతున్నారు. అలానే క్యాన్సర్ కణాలను కూడా అడ్డుకుంటుందట.
బీపీ ఉన్నవారికి సైతం దీని ఆకులు నేచురల్ మెడిసిన్‌లా ఉపయోగపడతాయట. రోజూ మార్నింగ్, ఈవెనింగ్ 2 నుంచి 3 ఆకులను నమలడం వల్ల షుగర్, బీపీ సమస్యలకు చెక్ పెట్టవచ్చట. ఈ పువ్వుకు సువాసన ఉండదు. ఈ పువ్వు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేప ఆకులు కూడా….
వేప ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ఆకులు, బెరడు, పువ్వులు, పండ్లు.. ఇలా మొక్కలోని ప్రతి భాగం ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఉదయం నిద్ర లేవగానే లేత వేప ఆకులను నమిలితే గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(గమనిక : ఈ కథనంలో అందించిన సలహా సాధారణ సమాచారం కోసం. ఏదైనా ఆరోగ్య సలహాపై చర్య తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి