Benefits of Rose: గులాబీలు అందానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఎలా అంటే..

గులాబీలు మంచి సౌందర్య సాధనం. గులాబీలు చర్మానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు.

Benefits of Rose: గులాబీలు అందానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఎలా అంటే..
Rose Benefits For Hair
Follow us
KVD Varma

|

Updated on: Nov 10, 2021 | 1:18 PM

Benefits of Rose: గులాబీలు మంచి సౌందర్య సాధనం. గులాబీలు చర్మానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. గులాబీ రేకులతో చర్మం అలానే జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు.. జుట్టు పెరుగుదల కోసం గులాబీలను ఎలా వాడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్కిన్ టోనర్

రోజ్ వాటర్.. గులాబీ రేకులు ఉత్తమ సహజ స్కిన్ టోనర్. ఒక గిన్నె నీటిలో కొన్ని రేకులను వేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు వాటిని పిండి వేసి ఆ గులాబీల నీటిని శుభ్రమైన సీసాలోకి మార్చండి. దానిని దూదితో ముంచి, 3 సార్లు చర్మం పై రాయండి. మూడు లేయర్‌ల మధ్య పాజ్ చేసి, వాటిని ఆరనివ్వండి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కాంతివంతంగాఅలాగే, మృదువుగా చేస్తుంది.

మొటిమలకు మంచిది

మొటిమలు ముఖ్యంగా యుక్తవయస్కులకు తీవ్రమైన మానసిక పరిణామాలను కలిగిస్తాయి. దీనికి ఉత్తమ ఔషధం గులాబీ రేకులు. గులాబీలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి. గంధం, గులాబీ రేకు, రోజ్ వాటర్, తేనెను బాగా మిక్స్ చేసి, ఈ పోస్ట్‌ను ముఖానికి రాయండి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో దీనిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం పాటు కంటిన్యూ చేస్తే మొటిమల వల్ల మీ ముఖం మీద వచ్చిన ఎరుపుమచ్చలు మాయం అయిపోతాయి.

డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేస్తుంది

బిజీ లైఫ్ సిట్యువేషన్‌లో తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కెమికల్స్ తో కూడిన కొత్త క్రీములను అప్లై చేయడం ఇష్టం లేకుంటే గులాబీలతోనే పరిష్కారం దొరుకుతుంది. గులాబీలతో ద్రావణం తాయారు చేసుకుని.. ఒక దూదిని గోరువెచ్చని నీటిలో ముంచి, కంటి కింద నల్లగా కనిపిస్తున్న చోట మసాజ్ చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక వారం పాటు ఇలా చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది

పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి రోజ్ ఒక అద్భుతమైన రెమెడీ. గులాబీ రేకుల్లో ఉండే సహజ నూనెలు చర్మంలోకి లోతుగా పని చేస్తాయి. చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ఏవైనా క్రీములు రాస్తుంటే వాటికి రోజ్ వాటర్ మిక్స్ చేసి వాడుకోవచ్చు. ఇది చర్మం సహజ గ్లో.. మృదుత్వాన్ని తిరిగి ఇస్తుంది.

చుండ్రుకు విరుగుడు

గులాబీలు చర్మానికే కాకుండా జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తాయి. చుండ్రు వల్ల వచ్చే దురదను రోజ్ వాటర్ త్వరగా తగ్గించగలదు. తల స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. ఈ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఇది తలకు రక్త ప్రసరణను పెంచడమే కాకుండా జుట్టు తిరిగి పెరగడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి: Cinema after Corona: కరోనా తరువాత ఈ సినిమాలు కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాయి.. అవేమిటో తెలుసా?

Sleeping Time: మన నిద్రకూ గుండెపోటుకు మధ్య సంబంధం ఉంది.. రాత్రి ఎక్కువ సమయం మేల్కొంటే ఏం జరుగుతుందంటే..

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?