Sweaty Feet and Palm Issue: కాళ్లు, చేతులు ఎక్కువగా చమట పడుతున్నాయా.. అయితే ఈ హోమ్ రెమెడీస్ మీ కోపమే..
వేసవిలో చెమట పట్టడం సాధారణం. కానీ కొంతమంది చేతులు, కాళ్ళకు బాగా చెమట పట్టే సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. కొన్నిసార్లు పాదాలకు చెమట పట్టడం కూడా దుర్వాసనకు కారణం అవుతుంది. కొన్ని సులభమైన హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Prudvi Battula | Edited By: Ravi Kiran
Updated on: May 11, 2023 | 8:00 AM

వేసవిలో చెమట పట్టడం సాధారణం. కానీ కొంతమంది చేతులు, కాళ్ళకు బాగా చెమట పట్టే సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. కొన్నిసార్లు పాదాలకు చెమట పట్టడం కూడా దుర్వాసనకు కారణం అవుతుంది.

కొన్ని సులభమైన హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చల్లటి నీటితో చెక్ పెట్టవచ్చు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాదాలు, చేతులకు బాగా చెమట పట్టే సమస్యతో బాధపడుతున్నవారు.. వాటిని 15 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచాలి. ఇది చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.

రోజ్ వాటర్: దీన్ని అప్లై చేయడం వల్ల చేతులు, కాళ్లకు చల్లదనం ఇవ్వడంతోపాటు చర్మం కూడా మెరుస్తుందని పేర్కొంటున్నారు. రోజ్ వాటర్‌ను చేతులు, కాళ్ళపై రోజుకు రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేయాలి.

ఆరెంజ్ పౌడర్: ఆరెంజ్ పదార్థాల తొక్కలను ఎండబెట్టి వాటితో పొడిని తయారు చేయాలి. ఈ పొడిని పాదాలకు, చేతులకు క్రమం తప్పకుండా రాయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పొడి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్: వేసవిలో చేతులు, కాళ్ళకు చెమట పట్టే సమస్య ఉంటే.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం మంచిది. దీని కోసం నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. కాళ్లు, చేతులు అందులోనే కాసేపు ఉంచాలి.

టాల్కమ్ పౌడర్: పాదాలకు చెమట పట్టే సమస్య చాలా సార్లు పెరుగుతుంది. బూట్లు తీసిన తర్వాత వారి పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు టాల్కమ్ పౌడర్ వాడటం మంచింది. అయితే దానిని ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

ఈ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా కాళ్లకు, చేతులకు చెమట పట్టే సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.





























