Kidney Problems : శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. మీ కిడ్నీలు ప్రాబ్లమ్‌లో ఉన్నట్టే..
సోడియం, పొటాషియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. పోషకాలు నిండిన కూరగాయలు తినడం కిడ్నీలను కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పు, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. రోజుకు రెండు నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగటం అలవాటు చేసుకోవాలి.

మన శరీరంలోని కీలకమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది శరీరం నుండి వ్యర్థాలు, విషాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. అన్ని అవయవాల మాదిరిగానే, మన మూత్రపిండాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవి హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ మూత్రపిండంలో ఏదైనా సమస్య ఉంటే అది శరీరంలోని ఇతర భాగాలలో సమస్యలను సూచిస్తుంది. ఇలాంటి సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే గమనించి పరిష్కరించుకోవాలి. లేకుంటే అవి తరువాత పెద్ద సమస్యగా మారి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి. మూత్రపిండాల వైఫల్య సంకేతాలు ఉంటే శరీరంలోని ఈ భాగాలలో సమస్యలు కనిపిస్తాయి.
మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉంటే మొదటి లక్షణం నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. మూత్రాశయంలో వాపు పెరిగితే భవిష్యత్తులో అది తీవ్రమైన పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే, మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే సాధారణంగా గజ్జ ప్రాంతంలో వాపు లేదా సున్నితత్వం అనుభూతి చెందుతుంది. పక్కటెముకల చుట్టూ నొప్పిగా ఉంటుంది. తరచూ వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటివి కూడా సంకేతాలు. అలాగే, పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన వంటివి మూత్రపిండాల సమస్యలకు సంకేతం అంటున్నారు నిపుణులు. మూత్రపిండాల పనితీరులో ఏదైనా సమస్య ఉంటే, అది తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కూడా కావచ్చు.
ఇటువంటి ప్రమాదకరమైన సమస్యలను నివారించడానికి కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు, అలవాట్లను అనుసరించాలి. మీ మూత్రపిండాలు జాగ్రత్తగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి. సోడియం, పొటాషియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. పోషకాలు నిండిన కూరగాయలు తినడం కిడ్నీలను కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పు, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. రోజుకు రెండు నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగటం అలవాటు చేసుకోవాలి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








