AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Sesame: నల్ల నువ్వులతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు

అంతే కాకుండా నిద్ర లేమి, నొప్పులు వంటివి కూడా తగ్గించేందుకు సహాయ పడుతుంది. నల్ల నువ్వులు తరచూ చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు, ముడతల తొలగిస్తుంది. నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి. నువ్వుల్లో జింక్, క్యాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయ పడతాయి. 

Black Sesame: నల్ల నువ్వులతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు
Black Sesame
Jyothi Gadda
|

Updated on: Jun 18, 2025 | 9:40 PM

Share

నువ్వులు.. సైజులో చాలా చిన్నవి..కానీ, పోషకాలలో మాత్రం అత్యంత శక్తితో నిండి ఉన్నాయి. తరచూ నల్లనువ్వులు తీసుకోవడం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల నువ్వుల నూనె రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సీజనల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనె రక్త ప్రసరణ, ఆక్సిజన్ కణజాలాలకు అందించడంలో సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.

నల్ల నువ్వుల నూనెలో కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముక ఆరోగ్యానికి నల్ల నువ్వులు ఎంతో ఆవశ్యకం. ఈ నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ అందిస్తుంది.

నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నల్ల నువ్వులు తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి, నొప్పులు వంటివి కూడా తగ్గించేందుకు సహాయ పడుతుంది. నల్ల నువ్వులు తరచూ చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు, ముడతల తొలగిస్తుంది. నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి. నువ్వుల్లో జింక్, క్యాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయ పడతాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..