AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

93 ఏళ్ల వృద్ధుడు తన భార్యకు ప్రేమతో ఖరీదైన మంగళసూత్రం కొన్నాడు.. కేవలం రూ.20లకే.. ఎలాగంటే..

వృద్ధ జంట దుకాణంలోకి వచ్చినపుడు ఆ వ్యక్తి వద్ద కేవలం రూ. 1,120 లు ఉన్నాయి. వాటితో అతను తన భార్యకు మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని చెప్పాడు. అతని కోరిక తనను ఆశ్చర్యపరిచిందని షాప్‌ యజమాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. అతని నుండి ఆశీర్వాద చిహ్నంగా రూ. 20 తీసుకొని, ఆ మంగళసూత్రాన్ని వారికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

93 ఏళ్ల వృద్ధుడు తన భార్యకు ప్రేమతో ఖరీదైన మంగళసూత్రం కొన్నాడు.. కేవలం రూ.20లకే.. ఎలాగంటే..
Maharashtra Elderly Couple
Jyothi Gadda
|

Updated on: Jun 18, 2025 | 6:08 PM

Share

శంభాజీనగర్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లు ఎంతగానో ఆకర్షించింది. మహారాష్ట్రతో పాటుగా ఇంటర్‌నెట్‌ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇది ఒక వృద్ధ జంట ప్రేమను చూపించింది. వారి ప్రేమతో ఏకంగా ఓ నగల వ్యాపారిని కదిలించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో 93 ఏళ్ల వ్యక్తి తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి ఒక నగల దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక నగల దుకాణంలోకి సాంప్రదాయ తెల్లటి ధోతీ-కుర్తా, తలపై టోపీ ధరించిన 93 ఏళ్ల వృద్ధుడు అడుగుపెట్టాడు. అతడి అవతారం చూసిన జ్యూవెలర్‌ షాపు సిబ్బంది అతడు ఎవరో బిచ్చగాడు అనుకుని పొరపడ్డారు. ఆ వృద్ధుడు ఆర్థిక సాయం కోరుతూ వచ్చాడని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి తన భార్య కోసం సాంప్రదాయ మంగళసూత్రం కొనాలని వచ్చినట్టుగా చెప్పాడు. అది విన్న షాప్‌ యజమాని, సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అంతలోనే ఆ వృద్ధుడి భార్య కూడా దుకాణంలోకి ప్రవేశించింది. వారివురు ఒకరికొకరు అంకితభావంతో, ప్రేమతో దుకాణంలోకి వచ్చారు. అక్కడ వారు ఒక బంగారు మంగళసూత్రాన్ని సెలెక్ట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారివురి మధ్య ప్రేమపూర్వక మాటలు, అప్యాయతను చూసిన దుకాణ యజమాని చలించిపోయి వారితో మాటలు కలిపాడు. ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ముగ్ధుడైన దుకాణ యజమాని, అతని నుండి కేవలం 20 రూపాయలు తీసుకొని ఆ హారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వృద్ధ జంట దుకాణంలోకి వచ్చినపుడు ఆ వ్యక్తి వద్ద కేవలం రూ. 1,120 లు ఉన్నాయి. వాటితో అతను తన భార్యకు మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని చెప్పాడు. అతని కోరిక తనను ఆశ్చర్యపరిచిందని షాప్‌ యజమాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. అతని నుండి ఆశీర్వాద చిహ్నంగా రూ. 20 తీసుకొని, ఆ మంగళసూత్రాన్ని వారికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌