AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హలో.. బండి కొంచెం మెల్లగా!”.. ప్రభాస్ డైలాగ్స్‌తో హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల అదిరిపోయే అవగాహన వీడియో!

తాజాగా రిలీజ్‌ అయిన ప్రభాస్‌‌‌‌ ‘ది రాజా సాబ్‌‌‌‌’ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ టీజర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ పాపులర్‌ అవుతోంది. అయితే ఈ పాటులారిటీని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఉపయోగించుకున్నారు. ది రాజా సాబ్‌ టీజర్‌లోని డైలాగ్స్‌తో ఓ అద్భుతమైన వీడియో క్రియేట్‌ చేసి ట్రాఫిక్స్‌ రూల్స్‌పై ప్రజలకు అవహగాహన కల్పిస్తున్నారు.

హలో.. బండి కొంచెం మెల్లగా!.. ప్రభాస్ డైలాగ్స్‌తో హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల అదిరిపోయే అవగాహన వీడియో!
Trafic Police
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 6:35 PM

Share

ట్రెండ్ కి తగ్గట్లు వాహనదారులకు అవగాహన కల్పించడంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడు ఏ కొత్త అంశం ట్రెండింగ్‌లోకి వచ్చినా దానికి తగట్టు వారి క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు క్రియేట్‌ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్‌ను వినియోగించుకొని ఓ కొత్త అవగాహాన విడియోను రూపొందించారు. ఇప్పటికే ‘సలార్’ సినిమాలోని డైలాగ్‌లతో న్యూ ఇయర్ సందర్బంగా సందేశాత్మక వీడియో విడుదల చేసిన పోలీసులు.. తాజాగా ‘రాజాసాబ్’ మూవీలోని ప్రభాస్ డైలాగ్‌లతో మరో ఆసక్తికర అవగాహన వీడియో క్రియేట్‌ చేసి వాహనదారుల్లో ట్రాఫిక్ రూల్స్‌ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

రాజా సాబ్‌ టీజర్‌లోని హలో బండి… కొంచెం మెల్లగా… అసలే మన లైఫ్ అంతంత మాత్రం!” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్‌తో ఓ వీడియో క్రియేట్ చేసి యూత్‌కు మెసేజ్ ఇస్తున్నారు. పోలీసులు క్రియేట్‌ చేసిన వీడియోలో గతంలో ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ లోని ‘ఇట్స్ షో టైమ్’అనే డైలాగ్‌తో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రభాస్ బైక్‌పై రయ్‌ మంటూ వెళ్లే సీన్ వస్తుంది.. ఆ వెంటనే ‘రాజాసాబ్’లోని హలో బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయమనే డైలాగ్‌ను వస్తుంది. ఇది ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారిలో అవగాహణ కల్పించే విదంగా ఉండగా.. ఆ తర్వాత ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ హెల్మెట్‌ పెట్టుకొని బైక్ మీద నెమ్మదిగా వస్తున్న విజువల్స్‌ యాడ్‌ చేశారు. ఇక చివర్లో ప్రభాస్ హెల్మెట్ తీసే సీన్‌కి ‘మన లైఫ్ ఎంతో విలువైనది’ అనే క్యాప్షన్‌ను యాడ్‌ చేసి మెసేజ్‌ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తమ అభిమాన హీరో డైలాగ్‌తో హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు క్రియేట్‌ చేసిన వీడియోను ఫ్యాన్‌ తెగవైరల్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..