ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కామలి పోలీసు స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతి మరణం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్.. ప్రియురాలి చితిలోకి దూకేందుకు ప్రయత్నించడం స్థానికులను షాకింగ్‌కు గురి చేసింది.
ప్రియుడు అనురాగ్ ఫుల్‌గా మద్యం సేవించి ప్రియురాలు అంత్యక్రియలు చేస్తోన్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతి ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ప్రియురాలి చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అతడు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న మృతురాలి బంధువులు అతన్ని అడ్డగించి చితకబాదారు. ఈ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కన్హాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అతడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలను సేకరించనున్నట్టు తెలిపారు. ఈ సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్ చేస్తే
తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. వధువు ఏం చేసిందంటే ?

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
