Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?

Phani CH
|

Updated on: Jun 18, 2025 | 4:55 PM

Share

500 నోటుపై స్టార్‌ గుర్తా? ఇదేంటి నోట్లపై నెంబర్స్‌ కదా ఉంటాయి. ఈ నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ స్టార్‌ గుర్తున్న ఉన్న నోటు నకిలీదా? ఇలా స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు మన చేతికి వచ్చినప్పుడు చాలామంది ఇలాంటి గందరగోళానికి గురవడం సహజం. సాధారణంగా నోట్లను అంతగా పరిశీలించరు కానీ ఎప్పుడైనా అనుకోకుండా మీ ఫర్సులోని నోట్లను పరిశీలిస్తే.. కొన్ని నోట్లలో సీరియల్ నంబర్ మధ్యలో ఒక చిన్న నక్షత్రం ఉంటుంది.

చాలా మంది అలాంటి నోటు నకిలీది కావచ్చని అనుకుంటారు. లేందటే.. ఆ నోటుకి ప్రత్యేకమైన విలువ ఉంటుందని భావిస్తారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి స్పష్టమైన సమాచారం ఇచ్చింది. అసలు స్టార్‌ నోటు అంటే ఏంటి? ఆర్‌బిఐ ప్రకారం.. ఒక నోటు సీరియల్ నంబర్‌లో ఒక నక్షత్రం గుర్తు ఉన్నట్లయితే ఆ నోటు ‘భర్తీ నోట్’ అని అర్థం. అంటే ముద్రణ సమయంలో ఒక నోటులో పొరపాటు జరిగితే, దానిని తొలగించి దాని స్థానంలో కొత్త నోటు ముద్రిస్తారు. ఈ కొత్త నోటు సీరియల్ నంబర్‌లో ఒక నక్షత్రం ఉంటుంది. తద్వారా అది భర్తీ చేయబడిన నోటు అని గుర్తించవచ్చు. అలాంటి నోట్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నక్షత్రాలు ఉన్న అన్ని నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవని RBI స్పష్టం చేసింది. మీరు ఇతర నోట్లను ఉపయోగించినట్లే వీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇవి నకిలీవి కావు. అలాగే వాటి విలువలో తేడా లేదు. స్టార్‌ గుర్తులు ఉన్న నోట్లను మొదట RBI 2006 లో జారీ చేసింది. 100 సీరియల్ నంబర్ నోట్ల బండిల్‌లోని ఒక నోటు లోపభూయిష్టంగా మారినప్పుడు, దాని స్థానంలో నక్షత్రం ఉన్న నోటును ప్రవేశపెడతారు. ఈ నోట్లలో నక్షత్రం మాత్రమే భిన్నంగా ఉంటుంది. మిగతావన్నీ సాధారణ నోట్ల మాదిరిగానే ఉంటాయి. అలాంటి నోట్లు పెద్దగా లేవు. ప్రతి 1,000 నోట్లులో దాదాపు 100 నోట్లు మాత్రమే నక్షత్రాన్ని కలిగి ఉండవచ్చు. అంటే ఈ వ్యవస్థను ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఒక నోటు దెబ్బతిన్నట్లు గుర్తించినప్పుడు మాత్రమే ఇలాంటి నోట్లను ముద్రిస్తారు. అయితే ఈ నోటు ఎంతో విలువైనది అనుకుంటే పొరపాటే. నక్షత్రం ఉన్న నోటు మార్కెట్ విలువ సాధారణ నోటు విలువకు సమానంగా ఉంటుంది. అంటే సాధారణంగా 500 రూపాయల నోటుకు ఎలాంటి విలువ ఉంటుందో ఈ స్టార్‌ గుర్తు ఉన్న నోటుకు కూడా అందే విలువ ఉంటుందని గుర్తించుకోవాలి. ఇది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. తద్వారా చెడ్డ నోట్లను తొలగించి మంచి నోట్లతో భర్తీ చేయవచ్చు. ఇది నకిలీ లేదా ప్రత్యేక రకం నోటు కాదు. ఇది కేవలం ఒక ప్రత్యామ్నాయ నోటు. ఈ నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. మీరు వాటిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చు. ఈ నోటుపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో కూడా క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. వధువు ఏం చేసిందంటే ?