మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రోజూవారి కూలీపనుల నిమిత్తం వలస వచ్చే కొందరికి జాగా ఉండదు. అలాంటి వారు రోడ్డు మీదనో.. లేదా ఫుట్‌పాత్ మీదనో నిద్రపోతుంటారు. సరిగ్గా ఈ వ్యక్తి కూడా అంతే.! తన పని ముగించుకుని రాత్రివేళ ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే.. మీ గుండెలు అదరడం ఖాయం. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీదున్న ఫుట్‌పాత్‌పై హాయిగా నిద్రపోతున్నాడు.
ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏమో.. ఓ ఆడ సింహం అటుగా వచ్చింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ముసుగు తన్ని ఫుట్‌పాత్‌పైన హాయిగా నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లింది ఆ సింహం. వాసన చూసింది. అతను ఫుల్‌గా మందుకొట్టి పడుకున్నట్టున్నాడు. ఈ ఆడసింహానికి మందు వాసన గిట్టినట్టులేదు. వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇప్పటికే 1.2 మిలియన్ల మంది చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియో చూస్తే మళ్లీ సదరు వ్యక్తి ఫుట్‌పాత్‌పై పడుకునే ధైర్యం చేయడని ఇంకొందరు కామెంట్ చేశారు. కాగా, ఇది అసలు ఎక్కడ జరిగింది? ఏంటి? అని విశ్లేషించగా.. ఇది ఓ యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి.. ఏఐతో సృష్టించారని తెలుస్తోంది. ఇది ఏఐ వీడియో కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.500 నోటుపై స్టార్ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. వధువు ఏం చేసిందంటే ?

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
