చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.. శ్మశానానికి తీసుకెళ్లే సమయంలో..
ఈ క్రమంలోనే శనివారం ఉదయం అభిమాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆటోరిక్షాలో శివనేరి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. డాక్టర్ అహుజా చెక్ చేసి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా అతను ఊపిరి పీల్చుకోవడాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే అతన్ని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. స్పృహలోకి వచ్చిన అతడు..తన బంధువులతో కలిసి సంతోషంగా భోజనం చేశారని చెప్పారు.

ఓ వ్యక్తి చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే ఉన్నట్టుండి అతడు ఊపిరి తీసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఉల్హాస్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించిన వ్యక్తి అంత్యక్రియలకు ముందు సజీవంగా కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, జెజె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమాన్ గిర్ధర్ అనే 64ఏళ్ల క్యాన్సర్ పేషెంట్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 15 రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం అభిమాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆటోరిక్షాలో శివనేరి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. డాక్టర్ అహుజా చెక్ చేసి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా అతను ఊపిరి పీల్చుకోవడాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే అతన్ని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
స్పృహలోకి వచ్చిన అతడు..తన బంధువులతో కలిసి సంతోషంగా భోజనం చేశారని చెప్పాడు. కానీ, ఆస్పత్రి సిబ్బంది చేసిన నిర్వాకంతో అభిమాన్ కుటుంబీకులు ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో ఆస్పత్రి వర్గాలను నిలదీయటంతో తమ పొరపాటును అంగీకరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




