వేసవి వేడిని తట్టుకుని ఆరోగ్యంగా ఉండటం ఎలా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..!
వేసవిలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, చర్మ సమస్యలు తలెత్తుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, నీరు తగినన్ని మోతాదులో త్రాగడం, చర్మాన్ని సంరక్షించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు శరీరం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో తెలుసా..? ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. వేడి వాతావరణం మీ చర్మానికి, ఆరోగ్యానికి కీడు చేస్తుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే డీహైడ్రేషన్, వడదెబ్బ, దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయి.
వడదెబ్బ
ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం వడదెబ్బకు గురవుతుంది. UV కిరణాలు చర్మాన్ని ఎర్రబడేలా చేసి పొట్టు ఊడిపోయేలా చేస్తాయి. దీర్ఘకాలం ఎండలో ఉంటే చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది.
నివారణ చిట్కాలు
- SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ అప్లై చేయండి
- క్యాప్స్, సన్ గ్లాసెస్ ధరించడం అలవాటు చేసుకోండి
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో బయటకి వెళ్ళవద్దు
డీహైడ్రేషన్
వేడి వల్ల చెమట ఎక్కువగా పోయి నీరు కోల్పోతాం. దీంతో బలహీనత, మైకం వస్తాయి. పైగా చర్మం కూడా పొడిగా మారుతుంది.
నివారణ చిట్కాలు
- రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగండి
- దోసకాయ, పుచ్చకాయ లాంటి ఆహారం తీసుకోండి
- కెఫిన్, ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించండి
- చర్మానికి మాయిశ్చరైజర్ ఉపయోగించండి
- ఎక్కువగా ఎయిర్ కండీషనర్ వాడటం తగ్గించండి
వేడి దద్దుర్లు
చెమట వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు రావచ్చు.
నివారణ చిట్కాలు
- కాటన్‌తో చేసిన వదుల దుస్తులు ధరించండి
- చర్మాన్ని శుభ్రంగా ఉంచండి
- చల్లటి నీటితో స్నానాలు చేయడం అలవాటు చేసుకోండి
అలసట
వేడి వల్ల శరీరం అలసిపోతుంది. తలనొప్పి, వికారం వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే వడదెబ్బ కూడా వస్తుంది.
నివారణ చిట్కాలు
- ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఇంట్లో ఉండండి
- ఫ్యాన్ లేదా AC వాడి చల్లగా ఉండండి
- బలహీనంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి
గుండె సమస్యలు
వేడి వాతావరణం గుండెకు అధిక ఒత్తిడి పెంచుతుంది.
నివారణ చిట్కాలు
- ఎండలో బరువు పనిచేయకండి
- మీరు వాడే మందులు సరిగ్గా తీసుకోండి
- రక్తపోటు, పల్స్ ను పర్యవేక్షించండి
అధిక ఉష్ణోగ్రతలు మీ ఆరోగ్యానికి కీడును చేస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
