Ayurvedic Tips: ఆయుర్వేద చిట్కాలతో దగ్గు, జలుబు ఇట్టే తగ్గుతుంది తెలుసా..? అవేంటంటే..
Ayurvedic Tips for Cold and Cough: చలికాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు సర్వసాధారణం. తీవ్ర అనారోగ్యం కానప్పటికీ.. జలుబు కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ముక్కు కారడం, కళ్ళలో
Ayurvedic Tips for Cold and Cough: చలికాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు సర్వసాధారణం. తీవ్ర అనారోగ్యం కానప్పటికీ.. జలుబు కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ముక్కు కారడం, కళ్ళలో నుంచి నీరు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం లాంటి వాటితో రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా కరోనావైరస్ మహమ్మారి కాలం కావున జలుబు చేస్తే.. ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ ఏమోనన్న భయం కలుగుతోంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. కావున కొన్ని చిట్కాలతో జలుబును నివారించవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఆయుర్వేద నివారణలు మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. జలుబు, దగ్గు (Cold and Cough) నివారణకు తీసుకోవలసిన ఆయుర్వేద చిట్కాలు (Ayurvedic Tips), జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద చిట్కాలు..
∙ శీతల పానీయాలు, పెరుగు వంటి (చల్లని) తీవ్రతరం చేసే కారకాలను తినకూడదు. ముఖ్యంగా పండ్లు, ఐస్ క్రీమ్‌లు, పంచదార పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్ కలిపి హెవీ ఫుడ్‌ను తీసుకోకూడదు.
∙ పగటిపూట నిద్రపోకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఇది మంచిది కాదు.
∙ ఆలస్యమైనా మెలకువగా ఉండకండి. ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉండేందుకు నిద్ర బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం త్వరగా నిద్రపోవడం మంచిది.
∙ చల్లటి నీళ్లతో స్నానం చేయవద్దు లేదా చల్లటి నీరు తాగవద్దు.
∙ భస్త్రిక, అనులోమ విలోమ, భ్రమరీ ప్రాణాయామం ఆసనాలు ప్రతిరోజు రెండుసార్లు వేయండి. ఉదయం, రాత్రి రెండుసార్లు చేయడం ఆరోగ్యానికి మంచిది.
ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..
∙ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీకు జలుబు చేస్తే.. ఈ మిశ్రమం మీకు సహాయపడుతుంది. 7-8 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ వాము గింజలు, 1 స్పూన్ మెంతి గింజలు, పసుపు పొడి, 4-5 ఎండుమిర్చి ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించండి. ఈ మిశ్రమం ఉదయాన్నే తాగితే జలుబు, దగ్గు వెంటనే తగ్గుతుంది.
∙ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి గోరువెచ్చని నీరు తాగాలి. తేనె మీ గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.
∙ అల్లం, పసుపు, లెమన్ టీ తాగండి. ఆవిరి పీల్చితే ఉపశమనం కలుగుతుంది. ఆవిరి పీల్చడం కోసం నీటిలో కొంత వాము, యూకలిప్టస్ నూనె లేదా పసుపు కలపండి.
∙ పసుపు వేసి గోరువెచ్చని పాలను తాగండి. గొంతు నొప్పి ఉంటే.. లికోరైస్ డికాక్షన్ లేదా గోరు వెచ్చని నీటిలో పసుపు, రాళ్ల ఉప్పు వేసి పుక్కిలించండి.
Also Read: