Skin Care Tips: డార్క్‌ సర్కిల్‌ తొలగించాలంటే బంగాళదుంపతోనే సాధ్యం.. ఎలాగంటే..?

Skin Care Tips: మీ చర్మం వడదెబ్బకు గురై నల్లబడి, రంగు మారినట్లు కనిపిస్తే బంగాళాదుంపని ఉపయోగించడం ద్వారా మళ్లీ మెరుగుపరుచుకోవచ్చు. బంగాళదుంపలలో

Skin Care Tips: డార్క్‌ సర్కిల్‌ తొలగించాలంటే బంగాళదుంపతోనే సాధ్యం.. ఎలాగంటే..?
Potato Benefits
Follow us

|

Updated on: May 28, 2022 | 9:22 AM

Skin Care Tips: మీ చర్మం వడదెబ్బకు గురై నల్లబడి, రంగు మారినట్లు కనిపిస్తే బంగాళాదుంపని ఉపయోగించడం ద్వారా మళ్లీ మెరుగుపరుచుకోవచ్చు. బంగాళదుంపలలో విటమిన్ సి, విటమిన్ B6, విటమిన్ B1, B3, ప్రోటీన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ కణాలను రిపేర్‌ చేయడానికి పని చేస్తాయి. బంగాళాదుంప చర్మానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది. చర్మంపై మచ్చ లేకుండా చేస్తుంది. వేసవిలో బంగాళాదుంప చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది కాలిపోయిన చర్మ సమస్యను తొలగిస్తుంది. అయితే వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1. చర్మం టానింగ్‌ను తొలగించాలంటే

చర్మంపై ఉండే టానింగ్‌ను తొలగించుకోవాలంటే ఉడికించిన బంగాళదుంపలతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఉడికించిన బంగాళదుంపను తీసుకుని అందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా క్రీమ్ మిక్స్ చేసి ఈ ఫేస్ ప్యాక్ ను మెడ నుంచి ముఖం వరకు అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి కనీసం రెండు రోజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. మచ్చలని తొలగించడానికి

ముఖంపై మొటిమల గుర్తులు లేదా మచ్చలు తొలగించడానికి పచ్చి బంగాళాదుంపలను ఉపయోగించాలి. వీటిని బాగా కడిగి తురుముకుని, వాటితో ముఖానికి మసాజ్ చేయాలి.10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ముఖాన్ని వదిలేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. పొడి చర్మం కోసం

మీ చర్మం చాలా పొడిగా ఉంటే బంగాళాదుంప మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బంగాళాదుంపలను కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి. దానికి రెండు చుక్కల గ్లిజరిన్, రెండు చుక్కల రోజ్ వాటర్, అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ బియ్యప్పిండి కలపాలి. దీన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే చర్మానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.

4. డార్క్ సర్కిల్ తొలగించడానికి

మీ కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే బంగాళాదుంపను కడిగి తురుముకొని, రసాన్ని తీసి, దూదితో ఈ రసాన్ని వలయాలు ఉండే ప్రదేశాంలో రాయాలి. రోజూ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇలా చేయాలి. కొన్ని రోజుల తరువాత నల్లటి వలయాలు తొలగిపోతాయి. కావాలంటే బంగాళదుంప ముక్కలను కళ్లపై కూడా పెట్టుకోవచ్చు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!