AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Health Day: మహిళల్లో ప్రమాదరకరంగా మారుతున్న రొమ్ము క్యాన్సర్.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Womens Health Day: ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. నిజానికి కుటుంబం బాధ్యత మొత్తం వారే చూసుకుంటారు.

Womens Health Day: మహిళల్లో ప్రమాదరకరంగా మారుతున్న రొమ్ము క్యాన్సర్.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!
Womens Health Day
uppula Raju
|

Updated on: May 28, 2022 | 9:11 AM

Share

Womens Health Day: ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. నిజానికి కుటుంబం బాధ్యత మొత్తం వారే చూసుకుంటారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే రకరకాల వ్యాధులతో బాధపడుతారు. అందులో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే చికిత్స చాలా సులభం. అయితే ఆలస్యంగా గుర్తిస్తే ఇది చాలా తీవ్రమవుతుంది. ఇప్పుడు భారతీయ మహిళల్లో ఇది చాలా సాధారణ క్యాన్సర్‌ అయిపోయింది. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది దాదాపు 27 శాతంగా ఉంది. ఇటీవలి వాస్తవాల గురించి మాట్లాడితే భారతదేశంలోని పట్టణ ప్రాంతంలోని ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు, గ్రామీణ భారతదేశంలో ప్రతి 60 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తేలింది.

రొమ్ము క్యాన్సర్‌ డీఎన్‌ఏ లేదా జన్యు పరివర్తన నష్టం కారణంగా అభివృద్ధి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్‌తో మరణించే అవకాశం 1 శాతం మాత్రమే అయినప్పటికీ ఇది చాలా ఇబ్బందులని కలిగిస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవాలి. రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అస్సలు విస్మరించకూడదు. అది రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే.. రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడుతాయి. రొమ్ము చర్మంపై మార్పులు వస్తాయి. ఇవన్ని రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు.

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌కు శస్త్రచికిత్స ఉంది. అయినప్పటికీ రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ చేస్తారు. రొమ్ము క్యాన్సర్ దుష్ప్రభావాలు వారం నుంచి రెండు వారాలలోపు తగ్గుతాయి. అయితే కొన్ని మాత్రం తొలగిపోవడానికి చాలా నెలలు, సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ కొన్ని సందర్భాలలో మహిళల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కీమోథెరపీ అండాశయాలను దెబ్బతీస్తుంది. ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. అయినప్పటికీ సంతానోత్పత్తి సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు IVF లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ వంటి ART విధానాల సహాయంతో గర్భం దాల్చవచ్చు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా