Sleeping: తక్కువ నిద్రతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Sleeping: నిద్ర తక్కువగా ఉన్నవారికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తక్కువ నిద్రపోయే వారిలో ఆలోచన శక్తి,..

Sleeping: తక్కువ నిద్రతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!
Follow us

|

Updated on: Dec 25, 2021 | 9:03 AM

Sleeping: నిద్ర తక్కువగా ఉన్నవారికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తక్కువ నిద్రపోయే వారిలో ఆలోచన శక్తి, అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుందని పరిశోధకులు పలు పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు. నిద్రలేమితనం మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు నిద్రించాలి.. తక్కువ నిద్రపోయినట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయంపై పరిశోధనలు నిర్వహించారు. చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా ప్రతి రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రించడం ఉత్తమమని చెబుతున్నారు. ఇన్ని గంటలు నిద్రిస్తే మెదడుపై సానుకూలమైన ప్రభావం ఉంటుందని, అల్జీమర్స్‌ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, పలు విషయాలను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేయడం వంటివి తలెత్తడం అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలేనని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. నిద్రకు అల్జీమర్స్‌ వ్యాధికి సంబంధం ఉందని పరిశోధనలలో వెల్లడైంది. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రించాలని సూచిస్తున్నారు.

రాత్రి సమయంలో నిద్ర రాకపోతే శ్వాసపద్దతిని అనుసరించడం మంచిదని, యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ వెయిల్ ఈ సూత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్దతిని పాటిస్తే త్వరగా నిద్ర వస్తుందని అంటున్నారు. ఆ పద్దతిని పాటించలంటే నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోవాలి.. లేదా పడుకోవాలి. నాలుగు ముందు భాగాన్ని అంగిలితో దంతాల వెనుక ఉంచండి. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర వచ్చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

గోరువెచ్చని పాలు తాగితే ప్రయోజనం.. నిద్రలేమితనంతో బాధపడుతున్నవారు గోరువెచ్చని పాలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదే కాకుండా పాలలో పెప్టైడ్ కేసైన్ హైడ్రోలైజేట్ కూడా ఉంటుందని, ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రపోయేందుకు సహకరిస్తుందని పరిశోధకులు తేల్చారు.

ఇవి కూడా చదవండి:

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

Fish Benefits: చేపలు ఎక్కువగా తినేవారికి అలాంటి సమస్యలు రావు.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు