Lifestyle Diseases: 2030 నాటికి తీవ్ర ప్రమాదంలోకి ప్రజారోగ్యం.. పరిశోధకుల హెచ్చరికలు!
నేడు ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకుగల కారణాలను వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (world obesity federation) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో మరిన్ని షాకింగ్ విషయాలు..
Now a days obesity are increasing rapidly all over the world: నేడు ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకుగల కారణాలను వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (world obesity federation) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. అవేంటంటే.. 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి ఏడుగురిలో ఒకరు స్థూలకాయంతో బాధపడతారని తాజా నివేదిక చెబుతోంది. ఊబకాయంతో జీవిస్తున్న వారి సంఖ్య 2010తో పోలిస్తే 2030లో రెట్టింపు అవుతుందని తెల్పింది. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం తీవ్రతను అంచనా వేయడానికి మనదేశంతో సహా దాదాపు 200 దేశాలకు చెందిన పిల్లలు, స్త్రీ-పురుషులపై వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. ఊబకాయం కేసులు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోందట. అంతేకాకుండా 8 ఏళ్ల తర్వాత, అంటే 2030 నాటికి, ప్రపంచంలో సుమారు 100 కోట్ల మంది ప్రజలు ఊబకాయం బారీన పడతారని నివేదిక తెల్పింది. ఐతే 2010లో మన దేశంలో కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఉబకాయులు ఉండగా.. ప్రస్తుతం మాత్రం ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య 7 కోట్లకు పైనే పెరిగింది. ఇక 2030 నాటికి అయితే దాదాపు బకాయం 70 మిలియన్ల మందిని స్థూలకాయం బారీపపడతారని, వీరిలో 271 మిలియన్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలేనని నివేదిక చెబుతోంది.
ది గార్డియన్ నివేదిక ప్రకారం.. స్థూలకాయంతో బాధపడుతున్న ప్రపంచ మహిళల్లో 50 శాతానికి పైగా అమెరికా, ఇండియా, చైనా, పాకిస్తాన్‌లతో సహా 11 దేశాల్లోనే ఉన్నారు. ఇక పురుషుల విషయంలోనైతే 50 శాతానికి పైగా ఇండియా, అమెరికాతో సహా 9 దేశాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఊబకాయం రేటు మరింత వేగంగా పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కొవ్వులను చేర్చడం వల్లనే మన శరీర పరిమాణాల్లో మార్పులు వస్తున్నాయి. వీటి వల్ల ప్రత్యేకంగా ఎలాంటి పోషకాలు అందకపోయినా బరువు మాత్రం వేగంగా పెరగడం జరుగుతుంది.
స్థూలకాయాన్ని అదుపులో ఉంచాలంటే.. రోజూ వ్యాయామంతో పాటు ఆకుకూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు కూడా ఊబకాయానికి దారితీస్తుందని అనేక పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. ఐతే బరువు తగ్గడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది. లేదంటే పోషకాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: