Heart Health: అలర్ట్.. గుండె పదిలంగా ఉండాలంటే.. వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి..

ప్రస్తుత కాలంలో గుండె, రక్తపోటు, మధుమేహ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహారంలో ఖనిజాలు, ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Heart Health: అలర్ట్.. గుండె పదిలంగా ఉండాలంటే.. వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి..
Heart Health
Follow us

|

Updated on: Jun 26, 2022 | 6:13 AM

Nutrition For Heart: పని ఒత్తిడి, ఆందోళన అనేవి నేటి ఆధునిక జీవితంలో సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి సమయం ఉండటం లేదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చాలామందికి హాయిగా తినడానికి, నిద్రించడానికి కూడా సమయం ఉండటంలేదు. అటువంటి పరిస్థితిలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం పెరిగింది. పోషకాల కొరత వల్ల శరీరం అనేక రోగాల బారిన పడుతోంది. ముఖ్యంగా గుండె, రక్తపోటు, మధుమేహ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహారంలో ఖనిజాలు, ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితం, గుండె ఆరోగ్యవంతంగా ఉండాలంటే శరీరానికి ఎలాంటి ఖనిజాలు, విటమిన్లు అవసరమో ఇప్పుడు తెలుసుకోండి..

ఆరోగ్యకరమైన గుండె, శరీరం కోసం అవసరమైన విటమిన్లు, ఖనిజాలు..

  • ఆహారంలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని కోసం మల్టీ విటమిన్లు ఉండే పదార్థాలను కూడా తీసుకోవచ్చు. ఎక్కువసార్లు తినడం వల్ల శరీరంలోని అవసరమైన పోషకాల లోపాన్ని తీర్చడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఎప్పటికప్పుడు మల్టీ విటమిన్లు ఉండే పదార్థాలను తీసుకోండి.
  • పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్‌తో గుండె, మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ హోమోసిస్టీన్ సమ్మేళనాన్ని కరిగిస్తుంది. రక్త లోపంతోపాటు.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఒమేగా సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల ఎముకలు దృఢంగా మారడంతోపాటు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.
  • శరీరానికి ఐరన్ చాలా ముఖ్యం. ఇది ఎర్ర రక్త కణాలు పెరగడానికి దోహదపడుతుంది. ఐరన్ సరైన మొత్తంలో అందినప్పుడు హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది. ఐరన్ రోజంతా శక్తిని ఇవ్వడంతోపాటు శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
  • ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్ చాలా ముఖ్యం. జింక్ మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఉబ్బసం, అధిక రక్తపోటు ఉన్న వారికి జింక్ ప్రయోజనకరంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..