White Onion Benefits: తెల్ల ఉల్లితో ఆ సమస్యలే ఉండవు.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు అంతే..
ప్రస్తుత కాలంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో కూర్చొని పనిచేసే వారికి కంటి సమస్యలు, అలసట, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను మొదట్లో నిర్లక్ష్యం చేస్తే, పలు వ్యాధులకు దారితీస్తాయి.
White onion health benefits: ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఎందుకంటే.. ఉల్లిపాయల్లో ఎన్నో పోషకాలున్నాయి. కేవలం వంటలో రుచి కోసమే కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఉల్లి సహాయం చేస్తుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో కూర్చొని పనిచేసే వారికి కంటి సమస్యలు, అలసట, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను మొదట్లో నిర్లక్ష్యం చేస్తే, పలు వ్యాధులకు దారితీస్తాయి. అందుకని ఇలాంటి సమస్యలను మొదట్లోనే గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అజీర్ణం, పుల్లని తేపులు, గ్యాస్, ఉదరం వంటి సమస్యలు తలెత్తడంతోపాటు.. బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. అయితే కంటిచూపు సమస్య లేదా కళ్లు పొడిబారడం అనే సమస్య ఉంటే.. వీటిని నివారించడానికి తెల్ల ఉల్లిపాయను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెల్ల ఉల్లిపాయ ప్రయోజనాలు
- పొటాషియం అధికంగా ఉండే తెల్ల ఉల్లిపాయలు వేసవి, వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
- కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు రోజూ తెల్ల ఉల్లిని తినాలి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు. దీన్ని సలాడ్‌గా తినవచ్చు లేదా భేల్ లేదా చాట్‌లో కలిపి తినవచ్చు.
- తెల్ల ఉల్లిపాయ కంటికి కూడా చాలా మేలు చేస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసే వ్యక్తులు దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అలసట, బరువు, కళ్లలో నీరు కారడం వంటి సమస్యలు ఉండవు.
- ఉల్లిపాయలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా శక్తి స్థాయి పెరిగి.. సోమరితనం తగ్గుతుంది.
- ఉల్లిపాయలలో ఫోలేట్, విటమిన్-బి6 కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఎండాకాలం, వర్షాకాలంలో ఎక్కువగా కూర్చునే పని చేసే వారు తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాలి.
- ఉల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు అపానవాయువు, పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..