Pink Salt Benefits: రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఉప్పు మాత్రమే తినండి.. ఇంకా బొలెడన్ని లాభాలు

అధిక రక్తపోటు గుండెను దెబ్బతీస్తుంది.. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తపోటు రోగికి అత్యంత హాని కలిగించే ఒక పదార్థం ఎంటంటే.. ఉప్పు.

Pink Salt Benefits: రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఉప్పు మాత్రమే తినండి.. ఇంకా బొలెడన్ని లాభాలు
Pink Salt
Follow us

|

Updated on: Jun 26, 2022 | 6:20 AM

Pink Salt Benefits: ఉరుకులు పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే.. తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తారు. ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్‌ తీసుకోవడం వల్ల రక్తపోటు, షుగర్, ఉదరం, ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు గుండెను దెబ్బతీస్తుంది.. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తపోటు రోగికి అత్యంత హాని కలిగించే ఒక పదార్థం ఎంటంటే.. ఉప్పు. అధిక బీపీ సమస్య ఉన్నట్లయితే మీరు పరిమితంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కాకుండా సాధారణ ఉప్పుకు బదులుగా మీరు రాతి ఉప్పు (Rock Salt) ను తినాలి. దీనిని పింక్ సాల్ట్ అని కూడా అంటారు.

ఉపవాసంలో ఉన్నప్పుడు చాలామంది రాతి ఉప్పును ఉపయోగిస్తారు. ఈ రాతి ఉప్పు (సైంధవ లవణం) స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఈ ఉప్పు ఎలాంటి రసాయన ప్రక్రియ లేకుండా తయారవుతుంది. అదే సమయంలో, సాధారణ ఉప్పును తయారు చేసేటప్పుడు అనేక రసాయన ప్రక్రియలతో తయారు చేస్తారు. దీని కారణంగా ఉప్పులోని పోషకాలు తగ్గుతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే పింక్ సాల్ట్ వాడటం మంచిది. రాక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకోండి.

పింక్ సాల్ట్ ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి
  • పింక్ సాల్ట్ (రాక్ సాల్ట్) రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • రాతి ఉప్పులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • తొందరగా అలసటగా, బలహీనంగా అనిపించే వారు రాతి ఉప్పును మాత్రమే తీసుకోవడం మంచిది.
  • రాక్ సాల్ట్ అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా శరీరానికి విశ్రాంతినిస్తుంది.
  • రాతి ఉప్పు కళ్లకు కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు తగ్గకుండా కాపాడుకోవచ్చు.
  • పింక్ సాల్ట్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
  • వాంతులు లేదా వికారం సమస్య ఉంటే, మీరు నిమ్మరసంలో పింక్ సాల్ట్‌ను కలిపి తీసుకుంటే మంచిది.
  • రాళ్ల ఉప్పు తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య తొలగిపోయి నిద్ర బాగా వస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..