AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Leaves Benefits: వేప ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు.. అవేంటో తెలిస్తే..

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా వివిధ వ్యాధులకు గురవుతున్నారు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే వేప ఆకు గురించి అందరికి తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ..

Neem Leaves Benefits: వేప ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు.. అవేంటో తెలిస్తే..
Neem Leaves Benefits
Subhash Goud
|

Updated on: May 14, 2023 | 9:08 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా వివిధ వ్యాధులకు గురవుతున్నారు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే వేప ఆకు గురించి అందరికి తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

  1. వేప ఆకు రసం మధుమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనం. అలాగే అన్ని క్యాన్సర్లను నివారిస్తుంది. ఇదొక్కటే కాదు, అనేక ఇతర వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఈ ఆకుకు ఉంది.
  2. మధుమేహం ఉన్నవారికి ప్రతి రోజు వేల ఆకులను తీసుకుంటే అదుపులో ఉంచుతుంది. ఈ ఆకుల్లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. నిత్యం వేప ఆకులను తింటే మధుమేహం రాకుండా ఉంటుంది.
  3. అలాగే నోటిలో చాలా సూక్ష్మక్రిములు నివసిస్తాయి. ఇది శుభ్రం చేయకపోతే, ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. వేప ఆకుల్లో ఉండే క్రిమినాశక గుణాలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతాయి.
  4. కాలం గడుస్తున్న కొద్దీ క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. వేప ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి. అంతే కాదు ఈ ఆకు శరీరంలోని మృతకణాలను కూడా తొలగించగలదు.
  5. ఇవి కూడా చదవండి
  6. అనియంత్రిత, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలా మందికి అల్సర్ వస్తుంది. ప్రాథమికంగా ఈ వ్యాధి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా దాడి వల్ల వస్తుంది. వేప ఆకులు ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి.
  7. వేప ఆకులు మొటిమలు, చుండ్రుకు ఉత్తమ నివారణ. ఈ ఆకును మొటిమల మీద రాస్తే ఈ సమస్య తొలగిపోతుంది. అదే విధంగా తలకు రాసుకుంటే చుండ్రు సమస్య నుంచి ప్రయోజనం పొందుతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి