Natural Mouthwashes: ఈ నేచురల్ మౌత్ వాచ్‌లతో నోటి సమస్యలకు చెక్‌పెట్టండి.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే..
Natural Mouthwashes: దంతాలు, చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణం.. నోరు అపరిశుభ్రంగా ఉండడమే. నోటి అపరిశుభ్రత కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలకు కూడా కారణంగా మారుతుంది. మరీ ముఖ్యంగా కరోనాలాంటి ప్రమాదం పొంచి ఉన్న ఈ రోజుల్లో నోటి..
Natural Mouthwashes: దంతాలు, చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణం.. నోరు అపరిశుభ్రంగా ఉండడమే. నోటి అపరిశుభ్రత కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలకు కూడా కారణంగా మారుతుంది. మరీ ముఖ్యంగా కరోనాలాంటి ప్రమాదం పొంచి ఉన్న ఈ రోజుల్లో నోటి శుభ్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే మనలో చాలా మంది నోటి శుభ్రత కోసం మౌత్ వాష్‌లను ఉపయోగించుకుంటాం. అయితే మార్కెట్లో దొరికే చాలా వరకు మౌత్‌వాష్‌లలో రసాయానాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అలా కాకుండా ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలు కూడా మంచి మౌత్‌వాష్‌లా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని నేచురల్ మౌత్ వాచ్‌ల గురించి ఇప్పడు తెలుసుకుందాం..
* కొంచం దాల్చిన చెక్క నూనె, లవంగాల నూనెను తీసుకొని మిశ్రంగా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన నూనెను నోటిలో పోసుకొని పుకిలించాలి. అనంతరం నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. దంత క్షయం ఉన్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
* కలబంద గుజ్జు కూడా మంచి మౌత్ వాచ్‌లా ఉపయోగపడుతుంది. కొంచెం నీటిలో అంతే మోతాదులో కలబంద రసం కలిపి ఆ మిశ్రమంతో నీటిని పుక్కిలించాలి. అనంతరం నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల మధ్య పేరుకుపోయిన పాచి పోతుంది. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
* కొబ్బని నూనెతో కూడా నోటిని శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే.. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నోట్లో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని నోట్లో పోసుకుని 10-15 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. అనంతరం నూనెను ఉమ్మేయాలి. తరువాత నీటితో నోరును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే దంతాల సమస్యలు పరార్ అవుతాయి.
* ఇక ఉప్పు మంచి యాంటీ బ్యాక్టీరియాగా పని చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుకిలించి ఉంచాలి ఇలా చేస్తే నోరు శుభ్రంగా మారుతుంది.
Covid New Drug: కొవిడ్ రోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్న కొత్త డ్రగ్.. యాంటిబాడీ థెరపీతో మంచి ఫలితాలు