Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Vaccination: కరోనా టీకాలు వేయడంలో రికార్డు సాధించిన ముంబయి.. అక్కడ అందరికీ మొదటి డోసు పూర్తి!

కరోనా వ్యాక్సినేషన్ లో ముంబయి పెద్ద రికార్డు సృష్టించింది. ముంబయిలో శనివారం (నవంబర్ 13) నాటికి అందరు ప్రజలకు అంతే నూరు శాతం మందికి టీకా మొదటి డోసు ఇవ్వడం పూర్తయింది.

Mumbai Vaccination: కరోనా టీకాలు వేయడంలో రికార్డు సాధించిన ముంబయి.. అక్కడ అందరికీ మొదటి డోసు పూర్తి!
Mumbai Vaccination
Follow us
KVD Varma

|

Updated on: Nov 14, 2021 | 8:31 AM

Mumbai Vaccination: కరోనా వ్యాక్సినేషన్ లో ముంబయి పెద్ద రికార్డు సృష్టించింది. ముంబయిలో శనివారం (నవంబర్ 13) నాటికి అందరు ప్రజలకు అంతే నూరు శాతం మందికి టీకా మొదటి డోసు ఇవ్వడం పూర్తయింది. ఆరోజు వ్యాక్సిన్ తొలి డోస్ మొత్తం 92 లక్షల 35వేల 708 మందికి వేశారు. దీంతో ముంబయి ప్రజలు అందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి అయింది. శుక్రవారం నాటికి 838 మందికి తొలి డోస్ వ్యాక్సిన్ ఇస్తే నూరు శాతం పూర్తవుతుందని అంచనా ఉంది. ఈ మైలురాయిని శనివారం ముంబయి నగరం చేరుకుంది. దీంతో భారత్ లో ఈ రికార్డు నెలకొల్పిన తొలి మెట్రో నగరంగా ముంబయి నిలిచింది.

ముంబైకి ప్రతిరోజూ 2 లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ను డెలివరీ చేయగల సామర్థ్యం ఉంది. కానీ, టీకాలు వేయడం చాలా నెమ్మదిగా జరుగుతున్న కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. ముంబై చుట్టుపక్కల పట్టణ ప్రజలు కూడా ముంబైకి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంతమంది ముంబయి వాసులు వ్యాక్సిన్ మొదటి డోస్‌ను కోల్పోయారు. ఇదిలావుండగా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతో పోలిస్తే టీకా ప్రచారంలో ముంబై ముందంజలో ఉంది. ప్రస్తుతం, స్థానిక యంత్రాంగం డబుల్ డోస్ వ్యాక్సినేషన్ వైపు దృష్టి సారించింది. ఇప్పటి వరకు 65 శాతం మంది రెండో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా 80 శాతం మందికి టీకా మొదటి మోతాదు..

భారతదేశంలో, టీకాకు అర్హులైన వారిలో 80 శాతం మంది టీకా మొదటి డోస్ తీసుకున్నారు. మొత్తం 38 శాతం మంది రెండవ డోస్ వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. నవంబర్ 30 నాటికి కనీసం 90 శాతం మందికి వ్యాక్సిన్ మొదటి డోస్ వేయాలన్నది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యం. ‘హర్ ఘర్ దస్తక్’ ప్రచారానికి సంబంధించిన వెబ్‌నార్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ ఈ విషయాన్ని తెలిపారు.

దేశంలో 120 మిలియన్ల మంది ప్రజలు రెండవ డోస్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘హర్ ఘర్ దస్తక్’ ప్రచారంలో తమ తమ రాష్ట్రాల్లోని వయోజన జనాభా కనీసం మొదటి డోస్ అయినా పొందేలా చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రెండో డోస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్న వారికి రెండో డోస్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. మొదటి డోస్ తర్వాత నిర్ణీత విరామం ముగిసిన వెంటనే రెండవ డోస్ ఇవ్వాల్సిన వ్యక్తులు దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ, ఆ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు.

ఇవి కూడా చదవండి: Post Office Savings: మీకు తెలుసా? పోస్టాఫీస్ లో చేసే సేవింగ్స్ పై వడ్డీ మాత్రమే కాదు అదనపు టాక్స్ ప్రయోజనాలూ ఉంటాయి.. ఎలాగంటే..

Home Loan: ఇంటి కోసం తీసుకున్న లోన్ ముందస్తుగా చెల్లించడం వలన లాభం ఉంటుందా? టాక్స్ ప్రయోజనం లభిస్తుందా? తెలుసుకోండి!

Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం