AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Infections: తెలుగు రాష్ట్రాలను పలుకరిస్తున్న వానలు.. మరి వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధులేంటో తెలుసుకోండి

ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధక శక్తిపై అధిక ప్రభావం పడడం వల్ల అందరూ అనారోగ్యానికి గురవుతారు. అంటే జ్వరం, శరీర నొప్పులు, విరేచనాలు, దద్దుర్లు వంటి సమస్యలు అందరినీ వేధిస్తాయి. అందువల్ల వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Monsoon Infections: తెలుగు రాష్ట్రాలను పలుకరిస్తున్న వానలు.. మరి వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధులేంటో తెలుసుకోండి
Colds And Flu
Nikhil
|

Updated on: Jun 27, 2023 | 1:30 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇప్పటివరకూ దంచి కొట్టాయి. అయితే నైరుతీ రుతుపవనాల ఆగమనంతో వర్షాలు ప్రజలను పలుకరిస్తున్నాయి. ఇప్పటిదాకా మండే ఎండలతో ఇబ్బందిపడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. అయితే వర్షాకాలం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ఈ రోజుల్లో వ్యాధులు కూడా అంతేస్థాయిలు ప్రబలుతాయి. వర్షాలకాలం బ్యాక్టిరియా, వైరస్, శిలింద్రాలు, దోమలు వృద్ధి చెందడానికి అనువైన కాలం. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధక శక్తిపై అధిక ప్రభావం పడడం వల్ల అందరూ అనారోగ్యానికి గురవుతారు. అంటే జ్వరం, శరీర నొప్పులు, విరేచనాలు, దద్దుర్లు వంటి సమస్యలు అందరినీ వేధిస్తాయి. అందువల్ల వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమల నుంచి సరైన రక్షణ తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రోగాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

డెంగీ

డెంగీ అనేది ప్రధానంగా వర్షాకాలంలోనే ఎక్కువ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి దోమలు కుట్టడం వల్ల వస్తుంది. 2021లో 1,64,103 డెంగీ కేసులు నమోదయ్యాయంటే ఈ డెంగీ ఎంతలా ప్రజలను ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. డెంగీ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయంలో కుట్టే ఆడ ఎడిస్ దోమల ద్వారా వస్తుంది. అధిక జ్వరం, ఒళ్లునొప్పులు, అధిక చెమట, తలపోటు, కళ్లల్లో నొప్పి, వికారం, వాంతులు, అలసట, తేలికపాటి రక్తస్రావం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. డెంగీ వ్యాధి బాగా ముదరితే శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోయి మరణానికి కారణం అవుతుంది.

మలేరియా

మలేరియా సోకిన దోమలు కుట్టుడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంచితే అందులో దోమలు చాలా ఈజీ సంతానోత్పత్తి చేస్తాయి. అధిక జ్వరం, వణుకు, అధిక చెమట, తీవ్రమైన రక్తహీనత ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ చేయకపోతే సెరిబ్రల్ మలేరియాకు కారణం అవుతుంది. మూర్చ, మూత్రపిండాల వైఫల్యం, ఇతర శ్వాసకోస రుగ్మతలతో ప్రాణాపాయ పరిస్థితికి చేరతారు.

ఇవి కూడా చదవండి

ఇన్‌ఫ్లూఎంజా

అధిక తేమ, ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇన్‌ఫ్లూఎంజా చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, నిరంతర దగ్గు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి న్యుమోనియా, ఉబ్బసం, మధుమేహం, గుండె సమస్యలు వంటి ధీర్ఘకాలిక వైద్య పరిస్థితులను ప్రేరేపిస్తుంది.

చికున్ గున్యా

పేరుకుపోయిన నీళ్లల్లో పుట్టిన దోమల వల్ల ఈ వ్యాధి వస్తుంది. చికున్ గున్యా ఏడస్ అల్బోపిక్టస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన 3-7 రోజుల తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. నవజాత శిశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు. వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధి బారిన పడితే చాలా ఇబ్బంది పడతారు.

టైఫాయిడ్

టైఫాయిడ్ అనేది ఒక సూపర్ ఇన్‌ఫెక్షియస్ వర్షాకాల సంబంధిత అనారోగ్యం. కలుషితమైన ఆహారం, నీటి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ధీర్ఘకాలిక అధిక జ్వరం, కడుపునొప్పి, ఆకలి తగ్గడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..