Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Tips: చలికాలంలో బాదం తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు

శీతాకాలంలో కాల్చిన బాదంపప్పును బాగా తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చి బాదం కంటే కాల్చిన బాదంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు.

Winter Tips: చలికాలంలో బాదం తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Almonds
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2022 | 6:28 PM

బాదంపప్పులో విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చాలామంది తమ ఆహారంలో బాదంపప్పును కచ్చితంగా చేర్చుకుంటారు. నిపుణులు కూడా వీటిని తరచూ తీసుకోవాలని సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అన్ని సీజన్లలోనూ బాదంపప్పును తీసుకోవచ్చు. అయితే చలికాలంలో బాదంపప్పు తింటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చలికాలం సమస్యలు, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో కాల్చిన బాదంపప్పును బాగా తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చి బాదం కంటే కాల్చిన బాదంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఇందుకోసం బాదం పప్పును తీసుకుని, పాన్ మీద తక్కువ మంట మీద వేయించాలి. వీటిని అల్పాహారంగా, స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. బాదం పప్పులో ఉన్న పోషకాలు వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే  ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తాయి.

ఇక బాదం పప్పుని రోజులో ఎప్పుడైనా ఎలా అయినా తినవచ్చు. వీటిని ఎలాంటి ఫుడ్స్ లో అయినా కలిపి తీసుకోవచ్చు. మీకు నచ్చే స్నాక్స్ తయారీలో కూడా బాదం పప్పుని ఈజీగా కలుపుకోవచ్చు. ఇక ఎండు బాదం కంటే నానబెట్టిన బాదం ఎక్కువ పోషకమైనదిగా పరిగణిస్తారు. బాదం పప్పుపై గోధుమ రంగులో ఉండే చర్మంలో టానిన్ ఉంటుంది. ఇది పోషకాలను నిరోధిస్తుంది. కాబట్టి బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. బాదంలో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె రోగులకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. బాదం చర్మ సంరక్షణకు గొప్పగా సహాయపడుతుంది. దీనితో పాటు ఈ శీతాకాలంలో బాదం నూనెతో శరీరానికి మసాజ్ చేయడం మంచిది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం తగ్గేందుకు ఇది మంచి ఆహారం. బాదం రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మీ శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం లైపేస్ వంటి కొన్ని ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది, ఇది మీ జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి