Health: ఇన్‌స్టాంట్ ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డారా.? అకాల మరణం తప్పదంటోన్న పరిశోధకలు..
మారుతోన్న జీవన విధానం, ప్రపంచకీరణ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీసుకునే ఆహారంలోనూ సమూల మార్పులు వచ్చాయి. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్‌తో ఇన్‌స్టాంట్ ఫుడ్‌కు బాగా ఆదరణ పెరగింది. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు జనాలు బాగా అట్రాక్ట్..

మారుతోన్న జీవన విధానం, ప్రపంచకీరణ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీసుకునే ఆహారంలోనూ సమూల మార్పులు వచ్చాయి. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్‌తో ఇన్‌స్టాంట్ ఫుడ్‌కు బాగా ఆదరణ పెరగింది. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్యాక్‌డ్ ఫుడ్‌లకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్చరించడమే కాదు ఇలాంటి ఆహారం నిత్యం తీసుకుంటే అకాల మరణం తప్పదని నొక్కిమరీ చెబుతున్నారు. ఇన్‌స్టంట్ ఫుడ్‌ల వల్ల హృద్రోగాలు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు.
తాజాగా పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో, బ్రెజిల్‌లో ప్రాసెస్ చేసిన ఆహారాల కారణంగా మరణాలు 10 శాతానికి పైగా పెరిగాయని అధ్యయనం తెలిపింది. అప్పుడు బ్రెజిల్‌లో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నిషేధించారు. ఆ తర్వాత ఆ దేశంలో అకాల మరణాల సంఖ్య కూడా తగ్గింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, 2019లో బ్రెజిల్‌లో ఈ ప్రాసెస్ చేయబడిన ఆహారం కారణంగా 57,000 మందికి పైగా మరణించారు. అధిక ఆదాయ దేశాల్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో శరీరానికి ఏమాత్రం మేలు చేయని పదార్థాలు ఉంటాయి.
బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలో కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర అధికంగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా ఆర్థిక భారాన్ని పెంచడానికి కూడా కారణమవుతాయి. సూప్‌లు, సాస్‌లు, పిజ్జాలు, హాట్ డాగ్‌లు, సాసేజ్‌లు, ఐస్ క్రీం, కుకీలు, డోనట్స్ వంటివి ప్రాసెస్‌డ్ ఫుడ్ కిందికి వస్తాయి. ఒకప్పుడు, బ్రెజిల్‌లో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం అత్యధికంగా 13-21 శాతం వరకు ఉండేది. 2019లో బ్రెజిల్‌లో 30-69 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక సంఖ్యలో అకాల మరణాలు సంభవించాయి.




మొత్తం మరణాల సంఖ్యలో, 2,61,061 మంది ఈ అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తినడం వల్లే మరణించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ వాడుకలో ఉంది. అందుకే గుండె సమస్యలు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధుల వ్యాప్తి ఈ దేశాల్లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి బ్రెజిల్ ప్రభుత్వం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడానికి, స్థానిక దేశీయ ఆహార వినియోగాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో అక్కడ అకాల మరణాల సంఖ్య తగ్గింది. అదే సమయంలో గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..