ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగారో బండి షెడ్‌కే..!

08 April 2025

TV9 Telugu

TV9 Telugu

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది బీట్‌రూట్‌. శరీరానికి కీలక పోషకాలు, ఖనిజాలు... అందించడంలో బీట్‌రూట్‌ మేటి. కానీ, దీన్ని తినడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు

TV9 Telugu

మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత. ఈ ముప్పుని తగ్గించుకోవాలంటే ఐరన్‌ పోషకం ఒంట్లో పుష్కలంగా ఉండాలి. అది బీట్‌ రూట్‌ నుంచి తగినంతగా అందుతుంది

TV9 Telugu

ముఖ్యంగా బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని ఖాళీ కడుపుతో తాగడం అంత సురక్షితం కాదు. ఖాళీ కడుపుతో బీట్‌రూట్ రసం తాగడం వల్ల కలిగే నష్టాలు నిపుణుల మాటల్లో మీ కోసం

TV9 Telugu

బీట్‌రూట్‌లో నైట్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్ లేదా యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతుంది

TV9 Telugu

బీట్‌రూట్ రసం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల అకస్మాత్తుగా రక్తపోటు పడిపోయే ప్రమాదం ఇది. దీంతో తలతిరగడం లేదా బలహీనతకు దారితీస్తుంది

TV9 Telugu

బీట్‌రూట్‌లో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి హానికరం. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది

TV9 Telugu

బీట్‌రూట్‌లో సహజ చక్కెర ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల ఈ చక్కెర రక్తంలో త్వరగా కలిసిపోతుంది. దీని కారణంగా మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది

TV9 Telugu

భోజనం తీసుకున్న 1-2 గంటల తర్వాత లేదా తేలికపాటి అల్పాహారంతో పాటు బీట్‌రూట్ రసం తాగడం మంచిది. ఇందులో రుచి కోసం క్యారెట్, ఆమ్లా, ఆపిల్ వంటి ఏదైనా కూరగాయలు లేదా పండ్ల రసాలు కూడా కలపవచ్చు. తద్వారా ప్రభావం సమతుల్యంగా ఉంటుంది