Winter Care: పెదాలు పగిలి అంద విహీనంగా కనిపిస్తున్నాయా? అయితే ఈ సహజ చిట్కాలు మీకోసమే
చలికాలంలో వాతావరణంలోని మార్పుల కారణంగా పెదాలు పొడిబారతాయి. పగుళ్లు కలిగి అంద విహీనంగా కనిపిస్తాయి. దీంతో అదరాలు కాస్తా అంద విహీనంగా కనిపిస్తాయి.

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో అందం, ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. సీజనల్ వ్యాధులతో పాటు చర్మ సమస్యలు, జట్టు సమస్యలు తరచూ వేధిస్తాయి. మడమల పగుళ్లు, చుండ్రు సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక వీటన్నింటితో పాటు పెదాల సమస్య. ఈ సీజన్‌లోని వాతావరణ మార్పుల కారణంగా పెదవులు పొడిబారతాయి. అందుకే ఈ కాలంలో సరైన సంరక్షణ తీసుకోకపోతే అదరాల అందం పాడైపోతుంది. ఇది అమ్మాయిలను బాగా ఆందోళనకు గురి చేసే విషయం. వాతావరణంలోని మార్పుల కారణంగా పెదాల బాగా పొడిబారతాయి. అదే సమయంలో సూర్య కిరణాలు కూడా పెదాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలో బాగా సున్నితమైన భాగాల్లో పెదవులు కూడా ఒకటి. పైగా పెదాలకు నూనె గ్రంథులు లేవు. పెదవులు త్వరగా పగుళ్లు రావడానికి ఇదే కారణం కావచ్చు. అయితే శీతాకాలంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యలను మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా పెదాలను పెదాలను ఎక్స్‌ఫోలియేట్, మాయిశ్చరైజింగ్ చేయడం కాకుండా ఇతర విషయాలపై శ్రద్ద వహించాలి.
ఎక్స్‌ఫోలియేట్ చేసిన తర్వాత పెదవులు క్రమంగా పగలడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇవి క్రమంగా నోటి అల్సర్లకు దారి తీస్తాయి. ఈ డెడ్ స్కిన్ తొలగించినప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. పెదాలను మృదువుగా ఉంచడానికి, వారానికి ఒకసారి వాటిని చేతులతో ఎక్స్‌ఫోలియేట్ చేయండి. దీని కోసం మీరు షుగర్ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు. పెదవులకు మాయిశ్చరైజర్ అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే మీరు తప్పు. పొడిబారకుండా ఉండటానికి మీ పెదాలను తరచూ మాయిశ్చరైజ్ చేయాలి. సిరామైడ్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఉపయోగించడం ఉత్తమం. వెన్న ఉపయోగిస్తే మరీ మంచిది. పెదాలు తేమగా ఉన్నా లేకపోయినా మంచి లిప్ బామ్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మీరు ఎండలో బయటకు వెళుతున్నట్లయితే సన్‌స్క్రీన్‌తో పాటు లిప్ బామ్ కూడా తీసుకోండి. ఇది మీ పెదవులు పగలకుండా చేస్తుంది. చాలా మంది పెదాలు ఎండిపోగానే నాలుకతో తడి చేసుకుంటుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ అలవాటు పెదాలను మరింత పగిలిపోయేలా చేస్తుంది. నిజానికి లాలాజలం పెదాలను పొడిగా చేసి, వాటిని మరింత పగిలిపోయేలా చేస్తుంది. సమస్య మరింత తీవ్రంగా ఉంటే మాత్రం వెంటనే చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించడం మేలు.




నోట్: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..