Jackfruit Seeds: పనస పండు గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మైండ్ బ్లోయింగ్..!
ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో..
Jackfruit Seeds : పనస పండు.. ఇది చూసేందుకు పైకి భయానకంగా కనిపించినా.. దాని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. అతి పెద్ద సైజున్న పండ్లలో పనస పండు కూడా ఒకటి. ఇది ఏషియాలోనే ప్రసిద్ధి చెందిన ట్రాపికల్ ఫ్రూట్. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస పండు తినాల్సిందే.
అయితే, పనసపండులో మాత్రమే కాదు..పనసవిత్తనాలతో కూడా పసిడిలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..పనస పండు తో పాటు దాని విత్తనాల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పనస పండు గింజలతో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం..
పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.
శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
* పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
కంటి సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలి.
పని ఒత్తిడి వల్ల చాలా మందిలో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు అధిక మేలు చేస్తాయి.
పనస గింజలు నిత్యం తీసుకునే వారిలో ఎముకలతోపాటు దంతాలు గట్టిగా తయారవుతాయి.
పనస పండు గింజలను తరచూ తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుకోవచ్చు.
(నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.)