AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Viral News: వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు.. హనీమూన్‌ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు

ఊరేగింపు కోసం ప్రత్యేకంగా వధూవరులిద్దరూ వాటర్‌ ట్యాంక్‌పై కూర్చుని బరాత్ ప్రారంభించారు. ఊరేగింపులో పాల్గొన్న బంధుమిత్రులు నెత్తిన కుండలు మోస్తూ బయల్దేరారు. వధూవరులు ఊరేగి వెళ్తున్న వాటర్‌ ట్యాంక్‌ ఇరువైపులా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు.

Marriage Viral News: వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు.. హనీమూన్‌ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు
Marriage Viral
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2022 | 10:22 AM

Share

వివాహ వేడుక‌ల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర, ఆహ్లాద‌క‌ర‌మైన వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోలు నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇకపోతే, పెళ్లి తర్వాత జరిగే పెళ్లి బరాత్ అనేది ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. పెళ్లి ఊరేగింపు ఎంత ఘనంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి జరిగిన దాని కంటే మరింత ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించాలని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం వెరైటీ వాహనాలను ఎంచుకుంటారు. ఎనుగులు, గుర్రాలను కూడా బరాత్ కోసం వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే స్నేహితులు బంధువులు అందరికీ కూడా పెళ్లి బరాత్ ఘనంగా నిర్వహించాలి, అందరూ బాగా డ్యాన్స్‌ చేయాలి.. అని ముందే చెప్తూ ఉంటారు. అందుకే ఇక భారత్ లో ఎక్కడపెళ్లి జరిగినపెళ్లి బరాత్ అంటే మినిమం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాంటి ఇక్కడ ఓ వధూవరులు వెరైటీ ఊరేగింపుతో తమ పెళ్లి బరాత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆ వీడియోలు, ఫోటోలు ప్రసతుతం ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి.

కొల్హాపూర్ నగరంలో నీటి సమస్యపై దృష్టిని ఆకర్షించడానికి, నూతన వధూవరులు తమ పెళ్లి బరాత్‌ను చక్కీ వాటర్ ట్యాంకర్ తో నిర్వహించారు. దాంతో సోషల్ మీడియా వేదికగా కొల్లాపూర్‌లో జరిగిన పెళ్లి బరాత్‌ చర్చనీయాంశమైంది. కొల్హాపూర్‌లోని ఖాస్‌బాగ్ మైదాన్ ప్రాంతంలోని ప్రిన్స్ క్లబ్‌లో నివసించే విశాల్ కొలేకర్, అర్పణ సలుంఖేలు గురువారం వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం భారీ ఊరేగింపుతో పెళ్లి బరాత్‌ ఏర్పాటు చేశారు. ఊరేగింపు కోసం ప్రత్యేకంగా వధూవరులిద్దరూ వాటర్‌ ట్యాంక్‌పై కూర్చుని బరాత్ ప్రారంభించారు. ఊరేగింపులో పాల్గొన్న బంధుమిత్రులు నెత్తిన కుండలు మోస్తూ బయల్దేరారు. వధూవరులను ట్యాంకర్‌పై కూర్చోబెట్టారు. హల్గీ ధ్వని, కొల్హాపూర్‌లోని మహద్వార్ రోడ్, మిరాజ్‌కర్ టికాటి, ఖాస్‌బాగ్ నుండి పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది.. వధూవరులు ఊరేగి వెళ్తున్న వాటర్‌ ట్యాంక్‌ ఇరువైపులా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. తమకు నీటి సరఫరాను పునరుద్ధరించే వరకు హనీమూన్‌ సాగేది లేదని బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. దీంతె ఈ పెళ్లి బరాత్‌ కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఫోటోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ అసలు కారణం ఏంటంటే..కొల్లాపూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. అనేక ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. దాంతో ఈ జంట ఇలాంటి విచిత్ర బరాత్ ఏర్పాటు చేసి పాలకులకు తమ నిరసన తెలియజేశారు. దాంతో అయ్యోపాపం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, భార్య ఇబ్బంది పడకూడదని కట్నంగా ట్యాంకర్ తీసుకెళ్లిందంటున్నారు మరికొందరు నెటిజన్లు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ వింత బరాత్‌ షో గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే సామాన్యులను పట్టిపీడిస్తున్న నీటి ఎద్దడిపై పాలకవర్గం ఎప్పుడు దృష్టి పెడుతుందంటూ నెటిజన్లు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు