Viral: హీరో మాదిరి క్లాస్ రూమ్‌లో అందరి ముందే స్టూడెంట్‌కు ప్రపోజ్ చేసిన మాస్టర్.. కట్ చేస్తే…
రెండక్షరాల ప్రేమ పుట్టడానికి రెండు క్షణాలు చాలు.. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిపైన పుడుతుందనేది చెప్పడం కష్టం. అయితే ఈ ప్రేమ పుట్టినప్పుడు సమయం, సదర్భం చూసుకోకుండా వ్యక్తీకరించి ఇరుకుల్లో పడతారు కొందరు.
Trending: స్టూడెంట్స్‌కు లెస్సన్స్ చెబుతూ.. ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పాల్సిన ఓ సార్ ట్రాక్ తప్పాడు. ప్రేమ ఊసులు చెప్పడం ప్రారంభించాడు. అంతేనా డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగాడు. ఎవరూ ఊహించని రీతిలో క్లాస్ రూమ్‌లోనే ఓ విద్యార్థినికి లవ్ ప్రపోజ్(Love Propose) చేశాడు. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా కాదు. అందరూ చూస్తూండగానే క్లాస్ రూం మధ్యలో సినిమాటిక్ స్టైల్‌లో మోకాళ్లపై కూర్చొని ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. మాస్టారు బాగోతాన్ని అక్కడే ఉన్న కొందరు స్టూడెంట్స్ వీడియో తీశారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన అసోం(Assam)లోని దేమాజీ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేమాజీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కేంద్రంలో మనోజ్ కుంబంగ్ అనే వ్యక్తి ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. అందులోనే శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థినికి క్లాస్ రూంలోనే హీరో మాదిరి ప్రపోజ్ చేసిన వీడియోలు వైరల్ కావడం వల్ల సంబంధిత అధికారులు మనోజ్‌పై వేటు వేశారు. సదరు విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. ఇది ఎవరూ ఊహించని ఘటన అని.. అతడు ఎందుకు అలా చేశాడో తెలియదని ఉన్నతాధికారులు తెలిపారు. విషయం మా దృష్టికి రాగానే అతడితో పాటు విద్యార్థినిపై చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు. అలాగే ఈ తతంగాన్ని ఫోన్‌లో రికార్డు చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి