ఈ లక్షణాలు మీలో ఉంటే చాలా ప్రమాదం..! చికిత్స తీసుకోకపోతే అంతే సంగతులు

Mental Health: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేము.

ఈ లక్షణాలు మీలో ఉంటే చాలా ప్రమాదం..! చికిత్స తీసుకోకపోతే అంతే సంగతులు
Mental Health
Follow us
uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 3:42 PM

Mental Health: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేము. ఇందుకోసం మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం అవసరం. గత రెండేళ్లుగా ప్రజలు కరోనాతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆందోళన, డిప్రెషన్‌కు కూడా బాధితులయ్యారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అది ఒక రుగ్మతగా మారే అవకాశం ఉంది.

మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి లక్షణాలు 1. చాలా కాలంగా నిరాశ, నిస్పృహలకు గురవ్వడం 2. తరచూ భావోద్వేగానికి లోనవ్వడం 3. నిస్సహాయంగా లేదా బలహీనంగా అనిపించడం 4. ఏదైనా కార్యాచరణపై ఆసక్తి లేకపోవడం. 5. తినడం, తాగడంపై కూడా శ్రద్ధ లేకపోవడం

డిప్రెషన్‌కి గురైన వారి లక్షణాలు 1. ప్రజలను కలవడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం 2. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం. 3. చాలామంది ఉన్నచోట ఉండకపోవడం 4. మానసిక స్థితిలో అధిక మార్పు. 5. చేసే పనిపై ఆసక్తి లేకపోవడం.

శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు కానీ మానసిక సమస్యలు అలా కాదు. చికిత్స ప్రారంభించినా చాలాకాలం పడుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి కూడా తన సమస్యను చెప్పడానికి వెనుకాడుతాడు. ఎందుకంటే ప్రజలు అవహేలన చేస్తారని భావిస్తారు. అందుకే అలాంటి వ్యక్తులతో మామూలుగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు అండగా నిలవడం, ధైర్యం చెప్పడం, నిత్యం ఎక్కువ మంది ఉన్న చోట ఉండేలా చేయడం అవసరం. అప్పుడే అతడ సాధారణ స్థితికి వచ్చేస్తాడు. మానసిక ఆరోగ్యంపై వైద్యుడితో మాట్లాడితే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం ధ్యానం తప్పనిసరి.

Pawan Kalyan: దామోదరం సంజీవయ్య సీఎంగా ఉంది రెండేళ్లే.. ఎన్నో అభివృద్ధి పనులు ఆయన చలవేనన్న జనసేనాని

T20 World Cup 2021: క్రికెట్‌ అభిమానులకు గుడ్ న్యూస్‌.. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో టీ20 సందడి..

Pandora Papers Leak: పండోరా పేపర్స్ లీక్ కేసులో ఇమ్రాన్ ఖాన్ సర్కార్.. టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు