T20 World Cup 2021: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో టీ20 సందడి..
ICC T20 World Cup 2021: ఐపిఎల్ తరువాత టి 20 వరల్డ్ కప్ సందడి మొదలైంది. ఇక క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ. 45 రోజుల టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొంటాయి.
ICC T20 World Cup 2021: ఐపిఎల్ తరువాత టి 20 వరల్డ్ కప్ సందడి మొదలైంది. ఇక క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ. 45 రోజుల టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొంటాయి. టీ 20 ప్రపంచకప్ సందర్భంగా అభిమానులు స్టేడియానికి వెళ్లడానికి అనుమతించారు. అదే సమయంలో భారతదేశంలోని అభిమానులు కూడా మల్టీప్లెక్స్‌లలో మ్యాచ్‌లను తిలకించవచ్చు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
ఇది కాకుండా, భారత బృందంలో మరో నాలుగు జట్లు కూడా ఉన్నాయి. నాకౌట్‌కి ముందు ఇండియా సూపర్ 12 లో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు అక్టోబర్ 18, 20 తేదీలలో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఐసిసి పివిఆర్ సినిమాస్‌తో జతకట్టింది. ఆ తర్వాత భారత అభిమానులు మల్టీప్లెక్స్‌లలో భారత మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
పీవీఆర్, ఐసిసి ఒప్పందం మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ఐసిసి పురుషుల టి 20 ప్రపంచకప్ 2021 క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందింది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో సహా అన్ని భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొ్ంది. ఈ మ్యాచ్‌లు న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్‌తో సహా 35 కి పైగా నగరాల్లోని 75 కి పైగా థియేటర్లలో ప్రదర్శిస్తారు.
సినిమా థియేటర్లపై నిషేధం కరోనా కారణంగా చాలా కాలంగా మూతపడిన థియేటర్లు ఇప్పుడు నెమ్మదిగా తెరుస్తున్నారు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులకే కాదు చాలా కాలంగా బాధపడుతున్న సినిమా హాళ్లకు కూడా శుభపరిణామం. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక 100 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో థియేటర్లను ప్రారంభించగా ముంబైలో 50 శాతం మందిని అనుమతించారు.