Balakrishna: సీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

రాయలసీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన నదుల

Balakrishna: సీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
Balakrishna
Follow us

|

Updated on: Oct 17, 2021 | 2:51 PM

Hindupuram meeting: రాయలసీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. “మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలి. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ.. కానీ నిర్లక్ష్యం కి గురై ఈ పరిస్థితి వచ్చింది.” అని బాలయ్య వ్యాఖ్యానించారు.

“ఇక్కడి పరిస్థితి చూసి హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పెట్టారు. తెలుగు గంగ ద్వారా కొంత వరకు సస్యశ్యామలం చేశారు. నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారు. 1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు.. ఎవర్నీ సంప్రదించరు. కరవు మండలాలకు నీరు వచ్చేలా స్కీం లు పూర్తి చేయాలి.” అని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

ఇవాళ హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జలాల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో చర్చ జరిగింది. నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన మీదే ప్రధానంగా చర్చంచారు. స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో ఈ మీటింగ్ నిర్వహించారు.

Read also: DL Ravindra Reddy: జూదం ఆడుకునేందుకు రష్యా వెళ్లే బాలినేనికి నన్ను విమర్శించే అర్హత లేదు: వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి