White Hair: తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చేయండి.. ఈ కొబ్బరి నూనెలో కలిపి చిన్ని చిట్కాతో..

Premature White Hair: చిన్న వయసులో తెల్లజుట్టు రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

White Hair: తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చేయండి.. ఈ కొబ్బరి నూనెలో కలిపి చిన్ని చిట్కాతో..
Premature White Hair
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:19 AM

ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే తెల్లజట్టు రావడం సాధారణంగా మారిపోయింది. కేవలం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సువారిలోనే ఇలాంటి సమస్య అధికంగా కనిపిస్తోంది. తలపై తెల్ల జుట్టు రావడం పెద్ద ఆందోలనకు కారణంగా మారుతోంది. ఇది జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు.. కానీ కొన్నిసార్లు మన చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణం. జుట్టు వండినప్పుడు చాలా సార్లు ఇబ్బంది పడుతుంటారు.  కొంతమంది హెయిర్ డై ద్వారా జుట్టును నల్లగా మార్చడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇది పొడిగా మారుతుంది. ఇలాంటి సమయంలో తెల్లజట్టును నల్ల జట్టుగా మర్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

జుట్టు మళ్లీ నల్లగా మారాలంటే ఏం చేయాలి..

కొబ్బరి నూనె జుట్టుకు ముఖ్యమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని కూడా తొలగిస్తుంది. అయితే ఈ నూనెలో నిమ్మరసం కలిపితే.. ఇది చాలా సులభం. జుట్టు నల్లబడటానికి,  జుట్టుకు అద్భుతమైన పోషణను కూడా అందిస్తుంది.

నిమ్మకాయ జుట్టుకు ఎందుకు ప్రయోజనకరం..

నిమ్మకాయను జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనితో చుండ్రు సులభంగా తొలగించబడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ జుట్టు సమయానికి ముందే తెల్లబడకుండా ఉండాలంటే.. దీని కోసం మీరు జుట్టుకు నిమ్మకాయను అప్లై చేయాలి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.

గ్రే హెయిర్‌ను నల్లగా మార్చడం ఎలా..

వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం సర్వసాధారణం.. అయితే ఇది చిన్న వయస్సులో తెల్లజుట్టు రాకూడదని అనుకుంటే.. నిమ్మకాయ, కొబ్బరి నూనె సహాయంతో ఇది చాలా ఈజీ అని చెప్పవచ్చు. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు. మన జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు కణాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం మిక్స్ చేసి స్కాల్ప్ నుంచి జుట్టు మొదళ్ల వరకు రాసుకోవాలి, ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే రక్తప్రసరణ పెరిగి జుట్టు సహజంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం