Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇవి తాగితే చాలు..

వెయిట్ లాస్ కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. డైట్ కంట్రోల్ తో పాటు.. వ్యాయమం వంటివి చేస్తారు. కొంతమందికి ఇలాంటి ఫలితాన్ని కూడా ఇస్తాయి. మరికొంతమంది బరువు తగ్గడం కోసం ఎంత ప్రయత్నం చేసినా..

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇవి తాగితే చాలు..
Low Calorie Soups
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 31, 2022 | 11:45 AM

వెయిట్ లాస్ కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. డైట్ కంట్రోల్ తో పాటు.. వ్యాయమం వంటివి చేస్తారు. కొంతమందికి ఇలాంటి ఫలితాన్ని కూడా ఇస్తాయి. మరికొంతమంది బరువు తగ్గడం కోసం ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కన్పించదు. మనం చేసే చిన్న చిన్న తప్పులే సరైన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం కావచ్చు. మన బరువు పెరగడం, తగ్గడం అనేది మనం చేసే పని, తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు. మనం తినే ఆహారంలో సమతుల్యత పాటించడంతో పాటు.. కొన్నింటిని యాడ్ చేసుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన ఆహారంగా కొన్ని సూప్ లను తాగితే ఫలితం గ్యారంటీ అని చెబుతున్నారు. అయితే కేవలం సూప్ లు తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గరు.. వాటిని మన ఆహారంతో తీసుకుంటూ మనం ఆచరించే ప్రణాళిక కూడా ఎంతో ముఖ్యం. సరైన ప్రణాళికతో మనం ఆహారం తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మన ఆహార నియమాల్లో సూప్ లను జోడించడం ద్వారా కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గడానికి సూప్‌లు తాగటం ఒక మార్గం మాత్రమే. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొవ్వును కరిగించే పోషకాలు, ఫైబర్, ప్రోటీన్, ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులు సూపులలో ఉంటాయి. వీటిని తాగటం ద్వారా ఆకలి తీరిన అనుభూతి కూడా కలుగుతుంది. సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్లినపుడు ఆర్డర్ చేసినవి వచ్చేలోపు చాలా మంది ఏదో ఒక సూప్ తీసుకుంటుంటారు. సూపులు తాగడం ద్వారా ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇలా ఆకలిని అదుపులో ఉంచడం ద్వారా, చిరుతిళ్లు తినడం తగ్గుతుంది. ఆ రకంగానూ బరువు పెరగటాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడకుండానే బరువు తక్కువ కావచ్చు. బరువు తగ్గేందుకు సహాయపడే సూపుల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ వెజిటబుల్ సూప్

గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర సూప్‌లో కేవలం చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఫలితం ఉండొచ్చు.

టోఫు సూప్

వెజిటబుల్ సూప్‌లలో టోఫు కూడా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. తక్కువ కేలరీల సూప్‌లలో టోఫు సూప్ ఒకటి. బరువు తగ్గడానికి ఇది అత్యంత రుచికరమైన ఎంపిక. వివిధ రుచుల కోసం వివిధ కూరగాయలను కలిపి సూప్ గా చేసుకుని తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

క్లియర్ సూప్

ఈ సూప్ చేయడానికి నచ్చిన కూరగాయలను ఉడకబెట్టాలి. బాగా మరిగిన తర్వాత ప్యూరీలా చేసుకోవాలి. ఈ సూప్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచి కోసం, దీనిలో కొన్ని నల్ల మిరియాలు లేదా వెల్లుల్లిని కలుపుకోవచ్చు. కూరగాయల ఎంపికలోనూ జాగ్రత్తలు అవసరం. దుంపలు వంటివి చేర్చుకోకూడదు. దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అవి బరువు పెరుగుదలకు కారణం కావచ్చు.

క్యాబేజీ సూప్

క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ అన్ని కూరగాయలను కలిపి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి. ఇవి నీరులా పలుచగా అయిన తర్వాత చిటికెడు ఉప్పు వేసి తాగాలి. థైరాయిడ్ తో బాధపడుతున్న వారు ఈ సూప్ తాగకపోవడం మంచిది.

చికెన్ సూప్

వెజిటేరియన్ సూపులు అందరికీ నచ్చకపోవచ్చు. నాన్ వెజ్ ప్రియులు అయితే తప్పకుండా నాన్ వెజ్ లేకుండా తమ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు అప్పుడప్పుడు చికెన్ సూప్ చేసుకోవచ్చు. ఇందులో కొవ్వు తక్కువ ఉంటుంది లేదా ఫిల్టర్ చేసిన చికెన్ రసాన్ని కూడా తీసుకోవచ్చు.

స్వీట్ కార్న్ సూప్ లేదా బంగాళాదుంప సూప్ వంటివి ఎక్కువ క్యాలరీలు కలిగి ఉండాయి. అందుకే వాటిని తీసుకోకూడదు. ఇలాంటివి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం సూప్ లు తాగడంతోనే బరువు తగ్గుతామనే అపోహలో ఉండకూడదు. మన ఆహారంతో సూపులను జోడించడంతో పాటు.. క్రమం తప్పని వ్యాయామాలు, మెరుగైన నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలిని అనుసరిస్తే పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు, తద్వారా బరువు కూడా తగ్గుతుంది. దీంతో ఆరోగ్య కరమైన జీవనాన్ని గడపడానికి మార్గం సుగమమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..