AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! తొలిదశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!

అమెరికా, యూరప్, ఆసియా లాంటి ప్రాంతాల్లో ఊబకాయం పెరగడం, మద్యం సేవనం లాంటి అలవాట్లు ఎక్కువగా కావడంతో కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో లివర్ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. 5లో 3 కేసులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Liver Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! తొలిదశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!
Liver Cancer
Prashanthi V
|

Updated on: Aug 14, 2025 | 2:47 PM

Share

కాలేయంలోని కణాలు అసాధారణంగా అదుపు లేకుండా పెరిగితే దాన్ని లివర్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే సరైన జీవనశైలి మార్పులు, హెపటైటిస్ వ్యాక్సిన్‌ లు తీసుకుంటే లివర్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం.. బరువు తగ్గడం, మద్యం సేవనం మానేయడం, ఫ్యాటీ లివర్ రాకుండా చూసుకోవడం, హెపటైటిస్ B, C లాంటి వైరస్‌ లకు చికిత్స తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఈ చర్యల ద్వారా 2050 నాటికి 90 లక్షల నుంచి 1.7 కోట్ల కొత్త కేసులు రాకుండా చూడవచ్చని.. 80 లక్షల నుంచి 1.5 కోట్ల ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక

వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం.. లివర్ క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది. దీనికి చికిత్స చాలా కష్టం. ఒకవేళ వెంటనే దీనిపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే 25 ఏళ్లలో ఈ వ్యాధి కేసులు, మరణాలు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంది.

లివర్ క్యాన్సర్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో లివర్ క్యాన్సర్ మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితి మారకపోతే 2022లో నమోదైన 7.6 లక్షల మరణాలు 2050 నాటికి 13 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది. లివర్ క్యాన్సర్ మొదటి దశల్లో చాలా మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఒకవేళ లక్షణాలు కనిపించినట్లయితే అవి ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • కారణం లేకుండా బరువు తగ్గిపోవడం.
  • ఆకలి లేకపోవడం.
  • పై పొట్టలో నొప్పి.
  • వాంతులు, కడుపులో అసౌకర్యంగా అనిపించడం.
  • బలహీనంగా, నిస్సత్తువగా ఉండటం.
  • కడుపు ఉబ్బరం.
  • పచ్చ కామెర్లు (చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం).
  • తెల్లటి మలం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రజలు హెపటైటిస్ వ్యాక్సిన్‌ ల గురించి అవగాహన పెంచుకోవాలి. అలాగే సరైన నివారణ చర్యలు పాటిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు.