AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Hiccups: మనలో చాలామందికి ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే వీటికి చాలామంది పలు కారణాలు చెబుతుంటారు. తరుచుగా ఆహారం తిన్నప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా ఆపాలో ఇప్పుడు చూద్దాం.

Health Tips: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
Hiccups
Venkata Chari
|

Updated on: Jan 31, 2022 | 12:22 PM

Share

Hiccups: మనలో చాలామందికి ఎక్కిళ్లు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా కావాల్సిన వాళ్లు బాగా తలచుకుంటున్నారని అనుకుంటుంటాం. అందుకే ఎక్కిళ్లు(Hiccups) వస్తున్నాయని భావిస్తుంటాం. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం అసలు విషయాన్ని కనిపెట్టారు. ఎక్కిళ్ల వెనుక ఉన్న ఇతర కారణాలను వెల్లడించారు. అసలు ఎక్కిళ్లు రావడానికి కారణంతోపాటు, వాటిని ఎలా నివారించుకోవచ్చు. మన గొంతులో ఎక్కిళ్లు వస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది మనలోని కండరాల అసంకల్పిత చర్య వల్ల వస్తున్నట్లు పేర్కొన్నారు. డయాఫ్రాగమ్ కండరాలు అకస్మాత్తుగా కుదింపులకు గురైనప్పుడు మీరు దానిని నియంత్రించలేరు. అప్పుడు మీకు ఎక్కిళ్లు వస్తాయి. కానీ, కొంత సమయం తర్వాత ఈ ఎక్కిళ్లు ఆగిపోతాయి. అంతే కాకుండా స్పైసీ ఫుడ్ కూడా ఎక్కిళ్లకు కారణమని భావిస్తున్నారు.

చాలామందికి ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు లేదా తరచుగా ఆహారం తిన్నప్పుడు కూడా ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే, మీరు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కొంత సమయంలో దానంతటదే ఆగిపోతుంది. కానీ, కొన్నిసార్లు ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం సమస్యగా ఉంటే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఎక్కిళ్లు ఎలా ఆపాలి.. ఎక్కిళ్లు ఆపడానికి కాసేపు మీ శ్వాసను ఆపుతూ ఉండాలి. ఎక్కిళ్లు వచ్చినప్పుడల్లా చల్లటి నీరు తాగవచ్చు. ఎక్కిళ్ళు ఆపడానికి, సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చొని, మీ ఛాతీకి మోకాళ్లను తీసుకుని, వాటిని రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. ఎక్కిళ్లు నిరంతరం వస్తుంటే, మీరు మీ నాలుకను కూడా బయటకు తీయడం ద్వారా ఎక్కిళ్ళను ఆపవచ్చు. అంతే కాకుండా ఎక్కిళ్ల నుంచి దృష్టి మళ్లించి మరికొంత సేపు ఫోకస్ పెడితే కూడా కాసేపట్లో ఎక్కిళ్లు ఆగిపోతాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read: Yoga Festival: సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే?

Health Tips: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా? అయితే ఈ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోండి..