Lemongrass Tea: పనిలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందా.. అయితే ఈ వెరై‘టీ’ ట్రై చేయండి
Lemongrass Tea: మనచుట్టూ కనిపించే చాలా మొక్కలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే మనం ఆ మొక్కలను పట్టించుకోకుండా నిర్లక్యం చేస్తూ.. సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే మెడిసిన్స్ ను ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తిని..
Lemongrass Tea: మనచుట్టూ కనిపించే చాలా మొక్కలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే మనం ఆ మొక్కలను పట్టించుకోకుండా నిర్లక్యం చేస్తూ.. సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే మెడిసిన్స్ ను ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అయితే మనం మొక్కలను నిర్లక్ష్యం చేయకుండా ఏ మొక్క ఎందుకోసం పనికొస్తుంది అని తెలుసుకోవడమే. అలాంటి మొక్కలో ఒకటి లెమన్‌గ్రాస్. దీనినే నిమ్మగడ్డి (Lemon grass)ని అంటారు. ఈ మొక్కలు ఎక్కువుగా శ్రీలంక(Srilanka), దక్షిణ భారతదేశం(South India)లో లభించే ఒక మూలిక. అయితే ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతుంది.
నిమ్మ గడ్డి మొక్క సముద్రపు గడ్డి ఆకులను పోలి ఉంటాయి. ఈ లెమన్‌గ్రాస్‌లో 55 జాతులు ఉన్నట్లు అంచనా వేయబడినప్పటికీ, ఈస్ట్ ఇండియన్ , వెస్ట్ ఇండియన్ రకాలు మాత్రమే వంటలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటాయి. లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య , ఔషధ ప్రయోజనాలపై పలువురు పరిశోధకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు నిమ్మ గడ్డి టీ తయారీ, లెమన్ గ్రాస్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
నిమ్మగడ్డితో టీ తయారీ విధానం.. ఒక పాత్రలో సగం వరకు నీటిని తీసుకుని మరిగించాలి. ఆ వేడినీటిలో నిమ్మగడ్డిని కాడలను నిటారుగా వేయాలి. ఈ గ్రాస్ ని వేసిన తర్వాత మరికొంత సేపు ఆ నీటిని మరిగించాలి. మరిగిన ఆ పూర్తి మిశ్రమాన్ని వడపోసి గ్లాసులోకి తీసుకోవాలి. అనంతరం ఆ నీటిలో ఐస్ క్యూబ్స్ జోడించడం వల్ల చల్లని లెమన్ గ్రాస్ టీ తయారవుతుంది. పుల్లపుల్లని లెమన్ టీ రెడీ.. రోజుని ఈ నిమ్మగడ్డి టీతో ఆహ్లాదకరంగా ప్రారంభించండి.. ఇక ఈ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
లెమన్‌గ్రాస్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు *ఈ టీ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా శరీరంలోని మంటను నివారిస్తుంది. *చాలా మంది వ్యక్తులు వేడి టీని తాగడం వలన రిలాక్స్‌గా ఉంటుందని భావిస్తారు. అయితే లెమన్‌గ్రాస్ టీ మరింత ఆందోళనను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. భావోద్వేగాలను నియంత్రించి ఒత్తిడినిట్టే దూరం చేస్తుంది. *నిమ్మగడ్డి టీ త్రాగటం వలన జీర్ణ క్రియ వేగవంతమవుతుంది. *లెమన్ గ్రాస్ టీ త్రాగటంవలన శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. *నిమ్మగడ్డికున్న సువాసన వలన మనసుకు రిలాక్స్ ఇస్తుంది. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. * లెమన్ గ్రాస్ టీ శరీరంలో అనవసరమైన వాయువులు పేరుపుకోకుండా చూసుకుని, త్రేన్పులని తగ్గిస్తుంది. *చాలా స్పాల్లో నిమ్మగడ్డి టీ వెల్‌కమ్ డ్రింక్‌గా ఇస్తారు. *నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులని దూరం చేయడంతో పాటు జీర్ణ సమస్యలని సమూలంగా పోగొడుతుంది. *జ్వరం, రొంప, దగ్గు, జలుబు వంటి సాధారణమైన వాటిని పూర్తిగా తగ్గించడంలో లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతుంది. *బరువు తగ్గించడమే కాక, రక్తపీడన సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా, జుట్టు, చర్మ సమస్యలను రాకుండా చూసుకుంటుంది.
Note: నిమ్మగడ్డిని కానీ,నిమ్మనూనె ను కానీ వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఒక్కోసారి దీనివల్ల ఎలర్జీలు రావచ్చు.