AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Talking: మనం నిద్రలో ఎందుకు కలవరిస్తామో తెలుసా.. దీనికి ఓ పెద్ద కారణం ఉందంటున్న వైద్యులు..

నిద్రలో కలవరించడం.. నిద్రలో మాట్లాడటం.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చేస్తుంటారు. ఇలా స్లీప్ టాకింగ్ అనేది పారాసోమ్నియా అని పిలువబడే ఒక రకమైన రుగ్మత. పారాసోమ్నియాలో నిద్రలో మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. ఎదుటివారికి అర్థంకాని విషయాన్ని చెబుతున్నాడు. వారు ఏం మాట్లాడుతున్నారో కూడా పక్కన ఉన్నవారికి అస్సలు అర్థం కాదు. ఇలా ఎందుకు చేస్తుంటారో మనం ఇక్కడ తెలుసుకుందాం..

Sleep Talking: మనం నిద్రలో ఎందుకు కలవరిస్తామో తెలుసా.. దీనికి ఓ పెద్ద కారణం ఉందంటున్న వైద్యులు..
Sleep Talking
Sanjay Kasula
|

Updated on: Aug 25, 2023 | 3:38 PM

Share

పేలవమైన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి వ్యక్తిగతంగా చాలా కారణాలు ఉన్నాయి. వారి బిజీ షెడ్యూల్ కారణంగా.. 8 గంటల పాటు తగినంత నిద్ర పోలేకపోతున్నారు. సరైన నిద్రలేకపోవడం కారణంగా వారు ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. సమస్య ఏంటంటే నిద్రలో మాట్లాడటం. కలవరించడం.. ఉలికిపడటం ఇలాంటివి తరచుగా నిద్రలో చేస్తుంటారు. ఈ సమస్య వృద్ధుల్లోనే కాదు. పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు నిద్రలో మాట్లాడటం చాలా సాధారణమైనదిగా భావిస్తారు. అయితే ఈ సమస్య ఓ ఆరోగ్య సమస్య అని మనలో చాలా మందికి తెలియదు.

స్లీప్ టాకింగ్ అనేది పారాసోమ్నియా అని పిలువబడే ఒక రకమైన కల రుగ్మత. పారాసోమ్నియాలో ప్రజలు నిద్రలో మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. ఎదుటివారికి అర్థంకాని విషయాన్ని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రజలలో సర్వసాధారణంగా మారింది. అయితే, నిద్రలో మాట్లాడే సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వెనుక కారణాలు ఏమై ఉండవచ్చో మనం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రజలు నిద్రలో ఎందుకు మాట్లాడతారు?

అలసట

అలసట, నిద్ర మధ్య చాలా లోతైన సంబంధం ఉంది. మీరు బాగా అలసిపోయినప్పుడు గాఢ నిద్ర వస్తుంది. అలసటగా ఉన్నా నిద్ర రాకపోవడం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు తరచుగా రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుంటూ కనిపిస్తారు.

డిప్రెషన్

డిప్రెషన్ అనేది కూడా ఓ సమస్య. ఇది బాధితుడిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. నిద్రపోతున్నప్పుడు కూడా.. ఒక వ్యక్తి డిప్రెషన్  కారణాల గురించి లేదా దానికి సంబంధించిన కలల గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాడు. చాలా సార్లు, డిప్రెషన్ కారణంగా.. అతను ఏదో భయపడటం ప్రారంభిస్తాడు. దాని కారణంగా అతను నిద్రలో మాట్లాడటం ప్రారంభిస్తాడు.

నిద్ర లేకపోవడం

ఎవరైనా 7-8 గంటల పాటు తగినంత నిద్రపోలేకపోతే.. వారు నిద్రలో మాట్లాడే పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.

అధిక జ్వరం

చాలా సార్లు తమ నిద్రలో మాట్లాడటం లేదా అధిక జ్వరం కారణంగా కలవరించడం మనం చూస్తుంటారు. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇలా కలవరించడం మనం చూస్తాం. అధిక జ్వరం ఉన్నప్పుడు ఎవరైన ఇలా చేస్తారు.

నివారణ ఏంటంటే..

  • తగినంత నిద్ర పొందడానికి ప్రయత్నించండి.
  • ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండండి.
  • డిప్రెషన్ మిమ్మల్ని డామినేట్ చేయనివ్వకండి
  • సానుకూలంగా ఆలోచించండి
  • యోగా లేదా ధ్యానం చేయండి
  • మీకు ఇష్టమైన కార్యకలాపాలు చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం